క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్‌పై వివరణ ఇచ్చిన నిధి అగర్వాల్


హైదరాబాద్: భారత క్రికెటర్లు.. బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమలో పడటం.. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోవడం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజాగా వీరిద్దరూ ముంబైలోని బాంద్రాలో ఓ రెస్టారెంట్‌లో విందు చేస్తూ మీడియాకు దొరికిపోయారు. వీరి మధ్య కొన్ని రోజుల కిందటే ప్రేమ చిగురించినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

రాహుల్ కలిసి డిన్నర్‌కు వెళ్లింది నిజమే
ఈ వార్తలపై గురువారం నిధి అగర్వాల్ స్పందించింది. ‘ఔను..నేను, రాహుల్ కలిసి డిన్నర్‌కు వెళ్లింది నిజమే. గతంలోనూ చాలా సార్లు వెళ్లాం. ఎన్నో ఏళ్ల నుంచి మేమిద్దరం ఒకరికొకరం తెలుసు. రాహుల్ క్రికెటర్ అవ్వకముందు, నేను నటిని కాకముందు నుంచి మా ఇద్దరికీ పరిచయం ఉంది' అని పేర్కొంది.

ఎప్పట్నుంచో మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది
'అలా అని మేమిద్దరం బెంగళూరులో కలిసి చదువుకున్నాం అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు. ఎప్పట్నుంచో మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది అంతే' అని నిధి అగర్వాల్ తెలిపింది. మరోపక్క కేఎల్ రాహుల్ మాత్రం ఈ డిన్నర్ డేటింగ్‌పై స్పందించకపోవడం విశేషం.

గతంలో కేఎల్ రాహుల్-మోడల్ ఎలిక్సిర్ నహార్ మధ్య అఫైర్
గతంలో కేఎల్ రాహుల్-మోడల్ ఎలిక్సిర్ నహార్ మధ్య అఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కేఎల్ రాహుల్ జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా ఆప్ఘన్‌తో జరిగే ఏకైక టెస్టులో చోటు దక్కించుకున్నాడు.

నాగచైతన్య సరసన ‘సవ్యసాచి' సినిమాలో
ఇక, నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు అఖిల్ కొత్త సినిమాలోనూ ఆమేనే కథానాయికగా తీసుకున్నారని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications