Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాను ఫైనల్‌కు తీసుకెళ్లేందుకు షకీబ్ వస్తాడట

 Nidahas Trophy: Shakib Al Hasan to return for Bangladesh in decider vs Sri Lanka

హైదరాబాద్: భారత్‌తో తలపడి ఓటమికి గురైన బంగ్లాదేశ్ జట్టును ఆదుకునేందుకు ఆ టీం ప్లేయర్ షకీబ్ అల్ హసన్ అందుబాటులోకి రానున్నాడు. కొంతకాలంగా అనారోగ్యం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఢాకాలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో గాయపడిన షకిబుల్‌ జట్టుకు దూరమైయ్యాడు.

గాయం నుంచి కోలుకుని త్వరగానే వస్తాడనుకున్న షకీబ్ అల్ హసన్ టీ20కు ముందునుంచి ఆడలేకపోయాడు. కానీ, అతను ఇంకా పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయమే పట్టింది.
కాగా, ఈ ముక్కోణపు సిరీస్‌లో లంకేయులతో అమీతుమీ తేల్చుకోవాల్సిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో షకిబుల్‌ను జట్టులో చేర్చుతూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

దాంతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ తుది జట్టులో షకిబుల్‌ స్థానం దాదాపు ఖాయం. రేపు(శుక్రవారం) శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌తో తలపడనుంది. ఇదే ఈ రెండు జట్లకు డిసైడింగ్ మ్యాచ్ కావడంతో పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది.

రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 17పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. దీంతో భారత్ ఫైనల్‌కు చేరినట్లే.

Story first published: Thursday, March 15, 2018, 17:59 [IST]
Other articles published on Mar 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+