For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిదాహాస్‌ ట్రోఫీ: తొలి మ్యాచ్ భారత్-శ్రీలంక జట్ల మధ్యే, పూర్తి షెడ్యూల్ ఇదే

By Nageshwara Rao
India Take on Hosts Sri Lanka in Opener; Final on March 18

హైదరాబాద్: ప్రస్తుతం కోహ్లీసేన సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ముక్కోణపు టీ20 సిరిస్ ఆడనుంది. మార్చి 6 నుంచి 18 వరకు నిదాస్‌ ట్రోఫీ జరగనుంది.

శ్రీలంకకు స్వాతంత్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఈ టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిన జరగనుంది. ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడాలి. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్‌ బోర్డు వెల్లడించింది.

టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ మార్చి 6న భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరగనుంది. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. అన్ని మ్యాచ్‌లు డే-నైట్ మ్యాచ్‌లే కావడం విశేషం. షెడ్యూల్ సందర్భంగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు తిలంక సుమతిపాల మాట్లాడుతూ 'మా 70 ఏళ్ల స్వాతంత్ర సంబరాలను పొరుగు దేశాలతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.

మార్చి 18న ఫైనల్‌ మ్యాచ్‌‌ జరగనుంది. ఈ టీ20 సిరిస్ హక్కులను యప్ టీవీ దక్కించుకుంది. యప్ టీవీ అమెరికా, కెనడా, మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, మలేషియా, యూకే, యూరప్‌లలో ఈ సిరీస్‌ మ్యాచ్‌లు ప్రసారమవుతాయని కానున్నాయి.

Schedule:
* March 6 - Sri Lanka vs India
* March 8 - Bangladesh vs India
* March 10 - Sri Lanka vs Bangladesh
* March 12 - India vs Sri Lanka
* March 14 - India vs Bangladesh
* March 16 - Bangladesh vs Sri Lanka
* March 18 - Final

Story first published: Tuesday, February 20, 2018, 21:10 [IST]
Other articles published on Feb 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+