'సునీల్ గవాస్కర్ నాగిని డ్యాన్స్ చేయడం సరికాదు'

హైదరాబాద్: నిదహాస్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆఖరి రెండు బంతులలో ఒక బాల్ ఉండగానే సిక్సు కొట్టడంతో జట్టు మ్యాచ్‌ను గెలుచుకుంది. మ్యాచ్ గెలిచిన అనంతరం బంగ్లా ఆటగాడు రెహమాన్ నాగిని డ్యాన్స్ వేస్తూ విజయాన్ని ప్రదర్శించాడు.
ఈ సన్నివేశం వీక్షకులను బాగా ఆకట్టుకుంది. దానికి స్పందించిన సునీల్ గవాస్కర్ సైతం ఆదివారం జరుగుతోన్న బంగ్లా, భారత్ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాడ్ని అనుకరిస్తూ నాగిని డ్యాన్స్ వేశాడు. అయితే దీనికి సానుకూలంగా స్పందించిన వారు కొందరైతే. .మరి కొందరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా చేయడం సబబు కాదంటూ మండిపడుతున్నారు.
ఫైనల్‌లో బంగ్లాదేశ్ ఓటమి సంగతి ఏమోగానీ.. గత మ్యాచ్‌లో వాళ్లు చేసిన నాగిని స్టెప్పులే వాళ్ల పాలిట ఇప్పుడు విలన్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బంగ్లా ప్లేయర్లను ట్రోలింగ్‌తో ఓ ఆటాడేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్(68) వేసిన నాగిని స్టెప్పు వీడియో కూడా వైరల్ అవుతుండటం విశేషం. మ్యాచ్ 9 ఓవర్లో ఉండగా.. కామెంటరీ బాక్స్‌లో ఉన్న గావస్కర్.. రోహిత్ బ్యాటింగ్ ధాటిని చూసి ఆపుకోలేకపోయారు. తన చెయిర్ నుంచి అమాంతం లేచిన ఆయన నాగిని స్టెప్పు వేసేశాడు. అది చూస్తూ మిగతా ఇద్దరు కామెంటేటర్లు తెగ నవ్వుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications