న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓటమికి నేనే కారణం: బాగా బౌలింగ్‌ చేసి ఉంటే, 16 కోట్ల మంది పెదవులపై చిరునవ్వు

By Nageshwara Rao
Nidahas Trophy 2018: Soumya Sarkar unable to recover from Final heartbreak

హైదరాబాద్: శ్రీలంక వేదికగా జరిగిన నిదాహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ ఓటమి బాధ నుంచి బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ ఓటమిని బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. చివరి వరకు గెలుస్తుందని అనుకున్న మ్యాచ్ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ క్రీజులోకి రావడంతో మ్యాచ్ సమీకరణాలే మారిపోయాయి.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

మనీశ్ పాండే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ కేవలం 8బంతుల్లో 29పరుగులతో చెలరేగి ఆడి అటు భారత్‌కు చిరస్మరణీయ గెలుపు అందించగా, బంగ్లాదేశ్‌ జట్టుకు మాత్రం నిద్రలేని రాత్రులు మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ ఓటమికి నేను కారణం అంటే.. నేను కారణమంటూ ఒక్కొక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మ్యాచ్‌ ఓటమిపై బంగ్లాదేశ్‌ పేసర్‌ రూబెల్‌ హుస్సేన్‌ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను ధారాళంగా పరుగులివ్వడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని, ఈ విషయంలో అభిమానులు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. తమ జట్టు ఓటమికి తానే కారణమవుతానని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

'మ్యాచ్‌ తర్వాత నిరాశకు లోనయ్యా. మ్యాచ్‌ గెలిచేస్థాయి నుంచి ఓడిపోయే స్థితికి వస్తామని అనుకోలేదు. ప్రతి ఒక్కర్నీ క్షమాపణ కోరుతున్నా. మమల్ని మన్నించండి' అంటూ రూబెల్‌ హుస్సేన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులను క్షమాపణలు కోరాడు. మ్యాచ్‌లో 19వ ఓవర్‌ వేసిన రూబెల్‌ 22పరుగులు సమర్పించుకున్నాడు.

దీంతో 12 బంతుల్లో 34 పరుగులుగా ఉన్న మ్యాచ్ సమీకరణం ఒక్కసారిగా 6 బంతుల్లో 12 పరుగులుగా మారింది. తాజాగా చివరి ఓవర్‌ వేసిన సౌమ్య సర్కార్‌ స్పందించాడు. మ్యాచ్‌ ఓటమికి తాను కూడా కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను ఇంతకుముందు కూడా బౌలింగ్ చేసాను. కానీ ఇలాంటి కఠిన సమయంలో మాత్రం ఎప్పుడు బౌలింగ్‌ చేయలేదు. ఈ మ్యాచ్‌తో ఎలాంటి పరిస్థితులోనైనా కట్టుదిట్టంగా బాల్స్‌ వేయగలననే నమ్మకం వచ్చింది' అని అన్నాడు.

'మా జట్టు క్రమంగా టీ20 గేమ్‌కు అలవాటు పడుతుంది. గతంలో టీ20 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓటమి చవిచూసేది. కానీ ఇపుడు 200 పరుగులు లక్ష్మాన్ని కూడా చేయగలుగుతున్నాం. అదే విధంగా భారీ లక్ష్యాలను కూడా సునాయాసంగా చేధించగలుగుతున్నాము. కానీ మొన్నటి మ్యాచ్‌ ఓటమి మరచిపోలేకపోతున్నాను' అని సౌమ్య సర్కార్ పేర్కొన్నాడు.

'మ్యాచ్‌ కోల్పోయిన తర్వాత మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇప్పటికీ ఆ మ్యాచ్‌ గుర్తొస్తే బాధగా ఉంది. ఎప్పుడైనా ఈ ఆలోచన వస్తే మ్యాచ్‌ కోల్పోవడానికి కారణం నేనేనంటూ చింతిస్తుంటాను. ఆఖరి ఓవర్‌లో భారత్‌ విజయానికి అవసరమైన 12 పరుగుల్ని సమర్పించుకోవడం నా కెరీర్‌లో చేదు జ్ఞాపకం. ప్రధానంగా చివరి బంతికి సిక్సర్‌ ఇచ్చి మా పరాజయంలో భాగమయ్యా. ఆ రోజు నేను బాగా బౌలింగ్‌ చేసి ఉంటే, 16 కోట్ల మంది ప్రజల పెదవులపై చిరునవ్వును చూసేవాళ్లం' అని తెలిపాడు.

బంగ్లాదేశ్‌తో గత ఆదివారం ఉత్కంఠభరింతగా సాగిన నిదాహస్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో సౌమ్య సర్కార్ వేసిని ఆఖరి బంతిని దినేష్‌ కార్తిక్‌ సిక్స్‌గా మలచడంతో భారత్‌ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, March 23, 2018, 13:24 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X