నిదాహాస్ ట్రోఫీ 2018: ఈ సిరిస్‌లో నమోదయ్యే రికార్డులివే


హైదరాబాద్: నిదాహాస్ ట్రోఫీ... ఈ టోర్నీకి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో ఆతిథ్య శ్రీలంకతో పాటు భారత్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. 1998లో తొలిసారి నిదాహాస్ ట్రోఫీ పేరిట శ్రీలంక 50 ఓవర్ల సిరిస్‌ను నిర్వహించింది.
మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ముక్కోణపు టీ20 సిరిస్‌ను నిర్వహిస్తుంది. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ముక్కోణపు టీ20 సిరిస్ రౌండ్ రాబిన్ పద్ధతిన జరగనుంది. అంటే టోర్నీలోని ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి సార్లు ఆడుతాయి.
టాప్‌లో నిలిచిన రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడుతాయి. ఫైనల్ మ్యాచ్‌తో సహా ఈ సిరిస్‌లోని అన్ని మ్యాచ్‌లు కొలంబోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. భారత్, శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్ టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ సిరిస్‌లో భారత జట్టు ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
ఈ సిరీస్ ద్వారా ఏ ఆటగాళ్లు ఏ రికార్డులను బద్దలు కొట్టనున్నారో తెలుసుకుందాం:
* 6,857 - ఈ సిరిస్‌లో రోహిత్ శర్మ మరో 143 పరుగులు చేస్తే ఏడు వేల పరుగులు క్లబ్‌లో చేరిన మూడో భారత్ ఆటగాడు అవుతాడు.
* 595 - టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన ఫోర్ల సంఖ్య. మరో ఐదు ఫోర్లు కొడితే టీ20ల్లో 600 ఫోర్లు కొట్టిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తాడు.
* 49 - ఇప్పటి వరకు టీ20ల్లో సురేశ్ రైనా బాదిన సిక్స్‌ల సంఖ్య. ఒక్క సిక్స్ కొడితే టీ20ల్లో భారత్ తరఫున 50 సిక్స్‌లు బాదిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
* 892 - అంతర్జాతీయ క్రికెట్‌లో శిఖర్ ధావన్ ఇప్పటి వరకు బాదిన ఫోర్ల సంఖ్య. ఈ టోర్నీలో ధావన్ మరో 8 ఫోర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో 900 ఫోర్లు బాదిన 12వ ఆటగాడు అవుతాడు.
* 954 - టీ20ల్లో అక్షర్ పటేల్ చేసిన పరుగులు. మరో 46 పరుగులు సాధిస్తే వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరుతాడు.
* 921 - టీ20ల్లో బంగ్లా క్రికెటర్ మహమ్మదుల్లా చేసిన పరుగులు. మరో 79 పరుగులు సాధిస్తే వెయ్యి పరుగులు పూర్తి చేసిన మూడో బంగ్లా ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు.
* 94 - అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక ఆటగాడు తిసార పెరీరా నమోదు చేసిన సిక్స్‌ల సంఖ్య. మరో ఆరు సిక్స్‌లు కొడితే లంక తరఫున 100 సిక్స్‌లు బాదిన చేసిన ఏడో ఆటగాడిగా నిలుస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications