For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన పూరన్.. పొలార్డ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ మరో అరుదైన ఘనత సాధించాడు. విండీస్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20తో ఈ ఘనత అందుకున్నాడు. 29 ఏళ్ల పూరన్ 2016లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 102 మ్యాచ్‌లు ఆడాడు. 26.83 సగటుతో, 137 స్ట్రైక్‌రేటుతో 2254 పరుగులు చేశాడు.

పూరన్ కంటే ముందు ఈ రికార్డు ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ పేరిట ఉండేది. 2008 నుంచి 2022 వరకు వెస్టిండీస్ తరఫున పొలార్డ్ 101 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1569 పరుగులు, 42 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో (91 మ్యాచ్‌లు), కెప్టెన్ పావెల్ (87 మ్యాచ్‌లు), రసెల్ (83 మ్యాచ్‌లు), క్రిస్ గేల్ (79) ఉన్నారు.

Nicholas Pooran Surpasses Kieron Pollard to Become West Indies Most-Capped T20I Player

కాగా, సెయింట్ లూసియా వేదికగా జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై జరుగుతున్న అయిదు టీ20ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే కోల్పోయినప్పటికీ నామమాత్రపు మ్యాచ్‌ల్లో చెలరేగుతోంది. 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఓవర్ మిగిలుండానే ఛేదించి పరువు కాపాడుకుంది. స్వదేశంలో తమ అత్యుత్తమ ఛేదనతో వెస్టిండీస్ రికార్డు నెలకొల్పింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 218 పరుగులు చేసింది. జాకోబ్ బెతెల్ (62 నాటౌట్; 32 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (55; 35 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. విల్ జాక్స్ (25; 12 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), సామ్ కరన్ (24; 13 బంతుల్లో, 2 సిక్సర్లు) దూకుడుగా పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో మొటియ్ రెండు వికెట్లు, రోస్టన్ ఛేజ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 19 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (68; 31 బంతుల్లో, 4 ఫోర్లు, 7 సిక్సర్లు), షై హోప్ (54; 24 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. కెప్టెన్ పావెల్ (38; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెర్పేన్ రూథర్‌ఫర్డ్ (29 నాటౌట్; 17 బంతుల్లో, 3 సిక్సర్లు) కీలక పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు వికెట్లు తీశారు.

Story first published: Sunday, November 17, 2024, 12:29 [IST]
Other articles published on Nov 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+