Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంత్‌ను మించిన పూరన్.. కిందపడి మరీ సిక్సర్ బాదేశాడు! (Video)

టీ20ల్లో అత్యంత ప్రమాదకర బ్యాటర్లలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ ఒకరు. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్‌కు సునాయాసంగా సిక్సర్లు సాధించే సామర్థ్యం సొంతం. ఇప్పటికే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. అయితే అబుదాబి టీ10 లీగ్‌లో ఓ బంతిని పూరన్ వినూత్నంగా స్టాండ్స్‌కు తరలించాడు. తన శైలికి విరుద్ధంగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తరహాలో స్కూప్ షాట్‌తో సిక్సర్ బాదాడు.

అబుదాబి లీగ్‌లో దక్కన్ గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న పూరన్.. మోరిస్విల్లే సాంప్ ఆర్మీ‌తో జరిగిన క్వాలిఫయిర్-1లో 33 బంతుల్లో 72 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అయితే అవుట్‌సైట్ ఆఫ్ స్టంప్ మీదుగా మహ్మద్ జహీద్ వేసిన ఫుల్ టాస్‌ను పూరన్ కిందపడి మరీ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదడం విశేషం. పంత్ కూడా కింద పడుతూ బంతిని బౌండరీలకు తరలిస్తుంటాడు.

Nicholas Pooran Stuns with Rishabh Pant-Style Scoop in Abu Dhabi T10 2024

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగన తొలి టెస్టులోనూ పంత్ ఇదే తరహాలో సిక్సర్ బాదాడు. ప్యాట్ కమిన్స్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ వైపుగా వేసిన బంతిని పంత్.. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ మీదుగా స్కూప్ షాట్‌తో సిక్సర్ సాధించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడ్డాడు. కాగా, ఈ ఇద్దరు హిట్టర్లు ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడనుండటం విశేషం. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. పంత్ కోసం లక్నో ఫ్రాంచైజీ రూ.27 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత గరిష్ట ధర పలికిన ప్లేయర్‌గా పంత్ నిలిచాడు. మరోవైపు పూరన్‌ కోసం రూ.21 కోట్లు వెచ్చించి లక్నో రిటైన్ చేసుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ (ధర- రూ.కోట్లలో)
రిషభ్ పంత్‌ (27), నికోలసన్ పూరన్‌ (21), రవి బిష్ణోయ్, మయాంక్‌ యాదవ్‌ (11), అవేశ్‌ ఖాన్‌ (9.75), ఆకాశ్‌ దీప్‌ (8), మిల్లర్‌ (7.50), సమద్‌ (4.20), మోసిన్, బదోని (4), మార్ష్‌ (3.40), షాబాజ్‌ (2.40), మార్‌క్రమ్‌ (2), బ్రిట్జ్‌కె, షమార్, సిద్ధార్థ్‌ (0.75), యువ్‌రాజ్‌ చౌదరి, ప్రిన్స్, ఆకాశ్, దిగ్వేశ్, హిమ్మత్, రాజ్‌వర్ధన్, ఆర్యన్, అర్శిన్‌ (0.30).

Story first published: Monday, December 2, 2024, 15:43 [IST]
Other articles published on Dec 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+