కావ్య పాప ధైర్యం చేసిందోచ్: ఆ ఒక్క ప్లేయర్ కోసం రూ.10 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ 15వ ఎడిషన్ మెగా వేలంపాట బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతోంది. సత్తా ఉన్న క్రికెటర్లపై కనకవర్షాన్ని కురిపిస్తోన్నాయి ఫ్రాంఛైజీలు. కోట్ల రూపాయలను గుమ్మరించేస్తున్నాయి. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడట్లేదు. దీనికి నిదర్శనం.. ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఈ యంగ్ అండ్ డైనమిక్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌ను తిరిగి దక్కించుకుంది. దీనికోసం ఏకంగా 15 కోట్ల 25 లక్షల రూపాయలను ధారబోసింది.

సై అంటే సై అంటూ..
ఈ వేలంపాట ఫస్ట్ ఆఫ్‌లో ఉండీ లేనట్టు కనిపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. తన ఆటతీరు తరహాలోనే ఫస్ట్ సెషన్‌లో క్రికెటర్లను కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా- సోషల్ మీడియా వేదికగా విమర్శలను సైతం ఎదుర్కొంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్.. ఒక్కసారిగా విజృంభించింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడంతో ఈ ఐపీఎల్ వేలంపాటలో బోణీ కొట్టింది.

ఇషాన్ కిషన్ కోసం పోటీ..
ఆ తరువాత వికెట్ కీపర్ కేటగిరీలో ఐపీఎల్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవడానికి కావ్య మారన్ ప్రయత్నించింది. దీనికోసం ఆమె మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టడానికీ వెనుకాడలేదు. ఇషాన్ కిషన్ కోసం తొలుత ముంబై ఇండియన్స్- ప్రీతిజింతా సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ మధ్య పోటీ తీవ్రంగా కొనసాగింది. 14 కోట్ల రూపాయల వరకు వెళ్లింది. ఆ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది.

చివరి వరకూ ప్రయత్నం..
ఇషాన్ కిషన్ ప్రైస్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. చివరికి- 15 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయడానికి వెనుకాడలేదు కావ్య మారన్. అటువైపు ఉన్నది ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కావడం వల్ల ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఇషాన్ కిషన్‌ను దక్కించుకోవడానికి ఎంతవరకైనా వెళ్లేలా కనిపించింది నీతా అంబానీ. చివరికి- సన్‌రైజర్స్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనితో 15.25 కోట్ల రూపాయలకు అతణ్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

పూరన్ కోసం మారన్..
ఆ వెంటనే మరో వికెట్ కీపర్, వెస్టిండీస్ పించ్ హిట్టర్ నికొలస్ పూరన్ కోసం కావ్య మారన్ పట్టుబట్టింది. అతన్ని దక్కించుకోవడానికి వేర్వేరు ఫ్రాంఛైజీలో పోరాడింది. మొదటి నుంచీ పూరన్ కోసం ప్రయత్నించింది. కోల్‌కత నైట్ రైడర్స్ వంటి ఫ్రాంఛైజీలు రేటు పెంచినప్పటికీ- కావ్య మారన్ వెనక్కి తగ్గలేదు. చివరికి ఈ ధర 10 కోట్ల రూపాయలను దాటినా మడమ తిప్పలేదు. చివరికి- 10 కోట్ల 75 లక్షల రూపాయలతో నికొలస్ పూరన్‌ను జట్టులోకి తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మెయిన్ వికెట్ కీపర్‌గా ఇక నికొలస్ పూరన్ వ్యవహరిస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications