Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Nicholas Pooran: ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌గా నికోలస్ పూరన్!

Nicholas Pooran: వెస్టిండీస్ విధంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతనికి కీలక బాధ్యతను అప్పగించింది. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 సీజన్‌కు ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టుకు కెప్టెన్‌గా నికోలస్ పూరన్‌ను నియమించారు. గత మేజర్ లీగ్ క్రికెట్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు కీరన్ పొలార్డ్ నాయకత్వం వహించి జట్టును టైటిల్‌కు నడిపించాడు. అయితే ఈ సారి కొత్త సీజన్‌కు కీరన్ పొలార్డ్ స్థానంలో నికోలస్ పూరన్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇది నికోలస్ పూరన్‌కు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వెంటనే లభించిన కీలక బాధ్యత

ఐపీఎల్ 2025లో నికోలస్ పూరన్ అద్బుత ప్రదర్శన
నికోలస్ పూరన్‌కు ఐపీఎల్ 2025 చాలా అద్భుతంగా సాగింది. లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్‌ను రూ.21 కోట్ల రూపాయలకు రీటైన్ చేసుకుంది. నికోలస్ పూరన్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ తాను ఎందుకు ఇంత భారీ మొత్తానికి రీటైన్ అయ్యాడో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025లో నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనతో 14 మ్యాచ్‌ల్లో 524 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో పూరన్ స్ట్రైక్ రేట్ 196.25గా ఉంది. ఇందులో 5 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా నికోలస్ పూరన్ సీజన్-18లో 40 సిక్సర్లు కొట్టి ఆ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.

Nicholas Pooran Named MI New York Captain New Role After International Retirement

నికోలస్ పూరన్ అంతర్జాతీయ కెరీర్
తన 9 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో నికోలస్ పూరన్ వెస్టిండీస్ తరఫున 61 వన్డేలు, 106 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేలలో నికోలస్ పూరన్ 3 సెంచరీలు, 11 అర్థసెంచరీలతో సహా 1983 పరుగులు చేశాడు. టీ20లలో నికోలస్ పూరన్ 13 అర్థ సెంచరీలతో 2275 పరుగులు సాధించాడు.

మేజర్ క్రికెట్ లీగ్ 2025 రేపటి (జూన్ 12) నుంచి జులై 13 వరకు అమెరికాలో జరగనుంది. మేజర్ క్రికెట్ లీగ్‌లో మొత్తం ఆరు జట్టు పాల్గొననున్నాయి. లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్ జట్టుకు సునీల్ నరైన్, ముంబై ఇండియన్ న్యూయార్క్‌కు నికోలస్ పూరన్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు కోరే ఆండర్సన్, సియాటిల్ ఒర్కాస్ జట్టుకు హెన్రిచ్ క్లాసెన్, టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు డుప్లెసిస్, వాషింగ్టన్ ఫ్రీడంకు మ్యాక్స్‌వెల్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

Story first published: Wednesday, June 11, 2025, 12:55 [IST]
Other articles published on Jun 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+