Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అద్భుతం.. రోహిత్, కోహ్లీ చేయలేనిది నికోలస్ పూరన్ చేశాడు..!

IPL 2025: ఐపీఎల్ 2025 నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ ను ఒక వికెట్ తేడాతో ఓడించినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో లక్నో విధ్యంసక ఆటగాడు నికోలస్ పూరన్ ఐపీఎల్ తొలి మ్యాచ్ నుంచే రికార్డు సృష్టించడం ప్రారంభించాడు. ఈ బ్యాటర్ టీ20 క్రికెట్‌లో భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేయలేనిది చేశాడు. అంతే కాదు ఆ జాబితాలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని కూడా లేరు.

సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో 7 సిక్సర్లు బాది ఆకట్టుకున్నాడు. ఈ సిక్సర్లతో నికోలస్ పూరన్ తన టీ20 కెరీర్ లో 600 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. ఈ టీ20 క్రికెట్ లో ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నికోలస్ పూరన్ నిలిచాడు. నికోలస్ పూరన్ కు ముందు ఈ ఘనత సాధించిన క్రికెటర్లు కూడా వెస్టిండీస్ వారే కావడం గమనార్హం. క్రిస్ గేల్ టీ20 కెరీర్‌లో 1,056 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. క్రిస్ గేల్ తర్వాత 908 సిక్సర్లు కొట్టి కీరన్ పొలార్డ్ రెండో స్థానంలో ఉన్నాడు.

Nicholas Pooran made history by becoming the fourth player to hit 600 sixes in T20 cricket

ఆండ్రీ రస్సెల్ 733 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.. నికోలస్ పూరన్ 606 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. టాప్ 4లో ఉన్న బ్యాటర్లంతా వెస్టిండీస్ చెందిన వారే కావడం గమనార్హం. టాప్-5లో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ 552 సిక్సర్లతో చోటు సాధించాడు. రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే 449 మ్యాచ్ లలో 525 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ 400 మ్యాచ్ లలో 419 సిక్సర్లను బాదాడు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఒక వికెట్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

టీ20లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితా ఇదే..

క్రిస్ గేల్ - 1056 సిక్సర్లు

కీరన్ పొలార్డ్ -908

ఆండ్రీ రస్సెల్ -733

నికోలస్ పూరన్ -606

అలెక్స్ హేల్స్-552

కాలిన్ మున్రో -550

గ్లెన్ మ్యాక్స్‌వెల్ -529

రోహిత్ శర్మ -525

జోస్ బట్లర్ -515

డేవిడ్ మిల్లర్ - 502

Story first published: Tuesday, March 25, 2025, 15:06 [IST]
Other articles published on Mar 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+