Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిక్సర్ల వీరుడిగా పూరన్ ఘన చరిత్ర..రోహిత్ సరసన!(Video)

వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ సిక్సర్ల వీరుడిగా రికార్డులు బద్దలుకొడుతున్నాడు. సిక్సర్ల మోత మోగిస్తూ చరిత్రకెక్కుతున్నాడు. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ రికార్డును బద్దలుకొట్టిన పూరన్ తాజాగా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో 140 సిక్సర్ల మార్క్‌ను అందుకున్న మూడో ప్లేయర్‌గా పూరన్ రికార్డు సృష్టించాడు.

28 ఏళ్ల వెస్టిండీస్ వికెట్ కీపర్ పూరన్ 89 ఇన్నింగ్స్‌ల్లోనే 140 సిక్సర్లను బాదడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్లు జాబితాలో పూరన్ ముందు స్థానాల్లో రోహిత్ శర్మ, మార్టిన్ గప్తిల్ మాత్రమే ఉన్నారు. రోహిత్ 151 ఇన్నింగ్స్‌ల్లో 205 సిక్సర్లు సాధించగా, న్యూజిలాండ్ హిట్టర్ గప్తిల్ 118 ఇన్నింగ్స్‌ల్లో 173 సిక్సర్లు కొట్టాడు.

Nicholas Pooran Joins Top 3 for Most Sixes in T20I History with 140 Sixes

పూరన్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బట్లర్, టీమిండియా విధ్వంసకర హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నారు. బట్లర్ 114 ఇన్నింగ్స్‌ల్లో 137 సిక్సర్లు, సూర్య కేవలం 68 ఇన్నింగ్స్‌ల్లోనే 136 సిక్సర్లు సాధించాడు. ఇక మాక్సీ 104 ఇన్నింగ్స్‌ల్లో 134 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి పదో స్థానంలో ఉన్నాడు. కోహ్లి 117 ఇన్నింగ్స్‌ల్లో 124 సిక్సర్లు కొట్టాడు.

కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో పూరన్ 140 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. షై హోప్ (41; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. పూరన్ (19; 19 బంతుల్లో, 1 సిక్సర్లు) పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో విలియమ్స్ మూడు, పాట్రిక్ రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. రీజా హెండ్రిక్స్ (44; 18 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడాడు. ట్రిస్టన్ స్టబ్స్ (28; 24 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), రికెల్టన్ (20; 13 బంతుల్లో, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. షామర్ జోషెఫ్, షెఫార్డ్ చెరో మూడు, అకెల్ హోస్సేన్ రెండు వికెట్లు పడగొట్టారు.

Story first published: Monday, August 26, 2024, 11:36 [IST]
Other articles published on Aug 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+