
హైదరాబాద్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్... క్రికెట్‌కు పుట్టినిల్లు. ఈ మైదానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ పుట్టింది ఇక్కడే కాబట్టి. ఈ గ్రౌండ్‌తో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 1996లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన గంగూలీ ఈ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌పై తన తొలి సెంచరీని సాధించాడు.
ఆ సిరిస్‌లో భాగంగా నాటింగ్‌హామ్ వేదికగా టెస్టులోనూ సెంచరీ సాధించాడు. 2002లో చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన నాట్ వెస్ట్ సిరిస్ పైనల్స్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన వెంటనే టీ షర్ట్ తీసివేసి లార్డ్స్ బాల్కనీలో సంబరాలు చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రతి భారత క్రికెట్ అభిమాని మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆటగాడిగా లేదంటే కామెంటేటర్‌గా లార్డ్స్‌లో అడుగుపెట్టిన సౌరవ్ గంగూలీ శుక్రవారం బీసీసీఐ అధ్యక్షుడిగా ఐకానిక్ స్టేడియంలో కాలుమోపాడు. బోర్డు కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌సింగ్ ధూమాల్‌తో కలిసి అదే బాల్కానీలో సెల్ఫీ దిగాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోని తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటూ "ఇద్దరు ప్రియ మిత్రులతో సరికొత్త బాధ్యతలతో (అధ్యక్ష పదవి) మరోసారి తిరిగొచ్చాను" అంటూ కామెంట్ పెట్టాడు.
ఇందుకు ప్రతిగా లార్డ్స్ క్రికెట్ తన ట్విట్టర్‌లో "సౌరవ్, మళ్లీ మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది" అంటూ గంగూలీ చొక్కా విప్పిన వీడియోను ట్వీట్ చేసింది. ఇంగ్లాండ్ బోర్డు అధికారులతో సమావేశం కారణంగా తొలిసారి దాదా బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఇంగ్లాండ్‌కు వచ్చాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పదవిలో 10 నెలలు ఉంటాడు.