
అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అశ్విన్
రెండో టెస్టులో 119 పరుగులిచ్చి మొత్తం 9 వికెట్లు సాధించిన స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ఏడాది అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 55 వికెట్లు కైవసం చేసుకుని శ్రీలంక బౌలర్ రంగన హెరత్ (54 వికెట్లు)ను అధిగమించిన అశ్విన్ కెరీర్‌లో ఇప్పటివరకూ 41 టెస్టు మ్యాచ్‌లలో మొత్తం 231 వికెట్లు సాధించాడు.

డీఆర్‌ఎస్: 12 సార్లు ఇంగ్లండ్, 9 సార్లు భారత్
టెస్టు క్రికెట్ చరిత్రలో 21 సార్లు ఇరు జట్లు డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకున్నాయి. 12 సార్లు ఇంగ్లండ్, 9 సార్లు భారత్ రివ్యూలు కోరాయి. ఇందులో ఆరు సార్లు అంపైర్ల నిర్ణయం తప్పుని తేలగా.. ఇరు జట్లు చెరో మూడు సార్లు నెగ్గాయి. తొలి టెస్టులో తొమ్మిదిసార్లే డీఆర్‌ఎస్‌ను వాడటం విశేషం.

246 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
విశాఖ టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ 246 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది రెండో విజయం. 1986లో హెడింగ్లేలో 279 పరుగుల తేడాతో టీమిండియా ఇంగ్లాండ్‌ను ఓడించింది.

జేమ్స్ ఆండర్సన్ రెండు సార్లు గోల్డెన్ డకౌట్
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రెండు సార్లు గోల్డెన్ డకౌటయ్యాడు. దీన్ని ‘కింగ్ పెయిర్' అంటారు. ఇంగ్లాండ్ తరఫున చివరగా 1906లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై ఎర్నీ హేస్ అనే బ్యాట్స్‌మెన్ ‘కింగ్ పెయిర్' అయ్యాడు.

ఎల్బీడబ్ల్యూల సంఖ్య 10
విశాఖ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు అయిన ఎల్బీడబ్ల్యూల సంఖ్య 10. ఒక టెస్టు మ్యాచ్‌లో ఇంత మంది ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం ఇంగ్లాండ్ జట్టుకు ఇదే తొలిసారి. మొత్తంగా చూస్తే పాకిస్థాన్, న్యూజిలాండ్ తర్వాత టెస్టుల్లో ఎక్కువ ఎల్బీలు నమోదు చేసిన మూడో జట్టు ఇంగ్లాండ్ నిలిచింది.

విరాట్ కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం
విశాఖపట్నం స్టేడియం టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం. ఇక్కడ జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో మరో 81 పరుగులు సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కైవసం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications