
గిల్ చెత్త బ్యాటింగ్
ఇలాంటి నేపథ్యంలో రోహిత్, రాహుల్, కోహ్లీని పక్కన పెట్టేసిన బీసీసీఐ.. పొట్టి ఫార్మాట్లో కుర్రాళ్లపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే వన్డే, టెస్టుల్లో రాణిస్తున్న శుభ్‌మన్ గిల్‌ను తొలిసారి టీ20లకు ఎంపిక చేసింది. శ్రీలంకతో జరిగిన తొలి రెండు టీ20ల్లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇక నిర్ణయాత్మక మూడో టీ20లో కూడా తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరాడు. అప్పుడు రాహుల్ త్రిపాఠీతో జత కలిసిన గిల్.. జట్టు ఇన్నింగ్స్ నిర్మించాల్సి వచ్చింది. అదిగో అప్పుడే తను ఆడుతున్నది టీ20 మ్యాచ్ అనే విషయం మర్చిపోయాడీ యంగ్ ఓపెనర్.

రాహుల్ వారసత్వం తీసుకున్నాడుగా..
బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న పిచ్‌పై ఆడుతూ.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ను మెయిడెన్ ఆడాడు. అవుటయ్యే సమయానికి గిల్ స్కోరు 36 బంతుల్లో 46 పరుగులు. అతని స్ట్రైక్ రేటు 127.78 మాత్రమే. ఇది చూసిన ఫ్యాన్స్ మండిపడ్డారు. కేఎల్ రాహుల్ ఈ ఫార్మాట్‌కు పనికిరాడని చెప్పి, నెక్స్ట్ రాహుల్‌ను తీసుకున్నారుగా అంటూ బీసీసీఐపై జోకులు పేలుస్తున్నారు. రాహుల్ కూడా టీమిండియా ఓపెనర్‌గా తొలి ఓవర్ మెయిడెన్ ఆడిన చరిత్ర ఉంది. దాన్ని గుర్తు చేస్తూ గిల్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.

త్రిపాఠీ, సూర్య సూపర్
గిల్ చేసిన్న నష్టాన్ని పూడ్చే బాధ్యత తీసుకున్న రాహుల్ త్రిపాఠీ (16 బంతుల్లో 35).. ఇన్నింగ్స్ వేగం పెంచే క్రమంలో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించడంతో మ్యాచ్ భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. త్రిపాఠీ, సూర్య పుణ్యమా అని భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో శ్రీలంక 138 పరుగులకే ఆలౌట్ అయింది. త్రిపాఠీ ఇన్నింగ్సే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని హార్దిక్ పాండ్యా కూడా మెచ్చుకున్నాడు.


Click it and Unblock the Notifications












