
హైదరాబాద్: రాబోయే 18 నెలలు భారత జట్టు అంటే ఏంటో నిరూపిస్తుందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. స్వదేశంలో అద్భుత విజయాలను నమోదు చేసి, కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా గురువారం ఉదయం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది.
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి హెడ్ కోచ్ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల గురించి జట్టుకు పూర్తి అవగాహన ఉందని అన్నాడు.
'నాలుగైదేళ్లుగా మేమంతా కలిసి ఆడుతున్నాం. ఈ అనుభవం బాగా ఉపయోగపడుతుంది. దక్షిణాఫ్రికా పరిస్థితులు కఠిన పరీక్ష పెట్టొచ్చు. గతంలో చెప్పిన విధంగా రాబోయే ఏడాదిన్నర కాలంలో భారత జట్టు అంటే నిరూపిస్తాం. ఈ విషయంలో జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసు' అని శాస్త్రి అన్నాడు
'మా బ్యాట్స్‌మెన్‌కు కఠినంగా అనిపించేలా వాళ్ల బౌలింగ్ ఉంటే మేం కూడా వాళ్ల బ్యాట్స్‌మెన్‌కు అదే తీరు చూపడం మా బాధ్యత. ఇది ఓ పెద్ద ఛాలెంజ్ లాంటింది. దక్షిణాఫ్రికా పర్యటన కఠిన సవాల్‌తో కూడుకున్నదే అయినప్పటికీ, ఇదంతా ఫ్రొఫెషన్ అని గుర్తించాలి' అని శాస్త్రి తెలిపాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్న డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లోనూ ఆకట్టుకుంటాడని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. బుమ్రా చాలా తొందరగా నేర్చుకునే వ్యక్తి అని రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.