For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్‌లో 800 వికెట్లు.. ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన స్టార్ క్రికెటర్!

ప్రపంచ క్రీడా రంగంలో ఫుల్ బాల్ తర్వాత మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఏదంటే టక్కున చెప్పే పేరు క్రికెట్. అంతలా ప్రేక్షకాదరణ పొందిందీ గేమ్. ప్రస్తుత తరంలో క్రికెట్ ఓ కమర్షియల్ గేమ్ గా అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఒక్కసారి క్రికెట్ లో మంచి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంటే, కాసుల వర్షంలో తడిసి ముద్దొవ్వచ్చు. అది అంతర్జాతీయ క్రికెట్ అయినా లేదా లీగ్ మ్యాచ్ అయినా కోట్ల రూపాయలను సంపాదించొచ్చు. అందులో వచ్చిన ఫేమ్ తో ఇతర రంగాలలోనూ అడుగుపెట్టి ఆర్జించొచ్చు.

కానీ ఒకప్పుడు జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించిన ఓ స్టార బౌలర్ ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్ గా మారిపోయాడు. ఒకప్పుడు మూడు ఐసీసీ వన్డే వరల్డ్ కప్స్ లోనూ పాల్గొన్న అతడు.. డేంజరస్ బౌలర్ గానూ పేరు సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు కారు డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. అతడు మరెవరో కాదు న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ ఈవన్ చాట్ ఫీల్డ్.

Newzealand World Cup Star Bowler Evan Chatfield took 800 Wickets is now a taxi driver

ప్రస్తుతం చాట్ ఫీల్డ్ వయసు 70 ఏళ్లు. 1975లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి 14 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు.
కెరీర్ లో 43 టెస్టులు, 114 వన్డేల్లో బరిలోకి దిగాడు. మొత్తంగా రెండు ఫార్మాట్లలో కలిపి 263 వికెట్లు తీశాడు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 587 వికెట్లు, లిస్ట్ ఏలో 222 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా కెరీర్ 800కు పైగా వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 1979, 1983, 1987 ప్రపంచకప్ టోర్నమెంట్లలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్ మొత్తంలో డేంజరస్ బౌలర్ గా పేరు గాంచిన అతడు 1989 తర్వాత క్రికెట్ కు దూరమయ్యాడు.

తొలి మ్యాచ్ లోనే తీవ్ర గాయం
చాట్ ఫీల్డ్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు. బంతి అతడి తలకు బలంగా తాకి గాయమైంది. ఆ తర్వాత అతడు కోలుకుని క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం తన అద్భుత ప్రదర్శనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చివరిగా భారత్ పై 1987లో భారత్ పై ఆడాడు. ఆ మ్యాచ్ లో మన దిగ్గజ క్రికెటర్ గావస్కర్ చాట్ ఫీల్డ్ బౌలింగ్ లో సింగిల్ ఓవర్ లో 21 పరుగులు కూడా చేశాడు. అలా ఇంతటి ట్రాక్ రికార్డ్ కలిగిన ఈ డేంజర్ బౌలర్.. ప్రస్తుతం సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. తనకు బాగా ఇష్టమైన డ్రైవింగ్ ఫీల్డ్ ను కెరీర్ గా ఎంచుకుని జీవితాన్ని గడపుతున్నాడు.

Story first published: Friday, January 31, 2025, 17:45 [IST]
Other articles published on Jan 31, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+