న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్.. ఓపెనర్లుగా ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే?

Newzealand won the toss and choose to field in the second INDvsNZ T20I

న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు మొదటగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు ఆడే 11 మందిలో చోటు దక్కలేదు. పిచ్, వాతావరణ చూసిన తర్వాతనే తను ఈ నిర్ణయానికి వచ్చినట్లు కివీస్ సారధి కేన్ విలియమ్సన్ చెప్పాడు. బ్యాటర్లు పిచ్‌ను త్వరగా అంచనా వేసుకొని ఆడాల్సి ఉంటుందని, అప్పుడే మంచి స్కోరు చేయగలుగుతామని హార్దిక్ పాండ్యా అన్నాడు.

విలియమ్సన్ నిర్ణయం..

విలియమ్సన్ నిర్ణయం..

న్యూజిల్యాండ్ జట్టులో ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఆడమ్ మిల్నే ఆడుతున్నాడు. టీమిండియాలో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రిషభ్ పంత్‌లకు చోటు కల్పించారు. ఇద్దరూ లెఫ్ట్ హ్యండర్లు ఓపెనింగ్ చేస్తుండటం గమనార్హం. ఈ మైదానంలో చివరగా ఆడిన రెండు అంతర్జాతీయ మ్యాచుల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. దీంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందని అంతా అనుుకున్నారు. కానీ కేన్ విలియమ్సన్ మాత్రం తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.

ఈ మ్యాచ్‌కూ వర్షగండం..

ఈ మ్యాచ్‌కూ వర్షగండం..

మూడు టీ20ల సిరీస్‌లో వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. ఆగకుండా కురిసిన వర్షంతో కనీసం టాస్ కూడా వేయకుండానే ఆ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న బే ఓవల్‌లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఈ మ్యాచ్ అయినా పూర్తిగా జరుగుతుందేమో చూడాలి.

భారత జట్టు:

భారత జట్టు:

ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిల్యాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్. డారియల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లోకీ ఫెర్గూసన్

Story first published: Sunday, November 20, 2022, 12:32 [IST]
Other articles published on Nov 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X