For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముక్కోణపు గెలుపు ఖాతా తెరిచిన న్యూజిలాండ్..! మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో రాణించిన డెవన్ కాన్వే

Newzealand Won Against Bangladesh and Register First Win in Ongoing Tri Series

క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో బంగ్లాదేశ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్.. ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో గెలుపు ఖాతా తెరిచింది. కివీస్ కీపర్ డెవన్ కాన్వే (70పరుగులు 51బంతుల్లో 7ఫోర్లు 1సిక్సర్ నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. శనివారం పాకిస్తాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన అనంతరం బలంగా కివీస్ పుంజుకుని బంగ్లాపై విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20ఓవర్లలో 8ఓవర్లలో 137పరుగులు చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో నజ్మల్ హుస్సేన్ షాంటో (33పరుగులు 29బంతుల్లో 4ఫోర్లు), వికెట్ కీపర్ నూరుల్ హసన్ (25పరుగులు 12బంతుల్లో 1ఫోర్, 2సిక్సులు నాటౌట్) రాణించారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, సౌథీ, ఇష్ సోధి, బ్రేస్ వెల్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. ఇక ఇష్ షోదీ టీ20లో 100వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.

ఇక తర్వాత ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 17.5ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. డెవన్ కాన్వేకు తోడు ఫిన్ అలెన్ (16), కేన్ విలియమ్సన్ (30పరుగులు), గెన్ ఫిలిప్స్ (23పరుగులు 9బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు నాటౌట్) తలా ఓ చేయి వేసి లక్ష్యాన్ని కరిగించారు. ఇక షారిఫుల్ ఇస్లామ్, హసన్ మహమూద్ తలా ఓ వికెట్ తీయగలిగారు. ఇక ఈ మ్యాచ్‌లో మైఖేల్ బ్రేస్‌వెల్ 4ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి 2వికెట్లు తీయడంతో పాటు కేవలం 14పరుగులే ఇచ్చాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 4పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 2పాయింట్లతో రెండో స్థానంలో బంగ్లాదేశ్ 0 పాయింట్లతో చివరి స్థానంలో ఉన్నాయి.

ఇరు జట్లు :

న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే ( వికెట్ కీపర్ ), కేన్ విలియమ్సన్ (కెప్టెన్ ), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మైఖేల్ బ్రేస్‌వెల్, ఇష్ సోధి, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌
బంగ్లాదేశ్ : మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, మొసద్దెక్ హుస్సేన్, యాసిర్ అలీ, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, షోరీఫుల్ ఇస్లాం

Story first published: Sunday, October 9, 2022, 18:37 [IST]
Other articles published on Oct 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+