మరో సిరీస్ సమర్పయామి..! భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేని విండీస్, మూడో వన్డేలో కివీస్ విజయం

బార్బడోస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 5వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 302పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ పెద్దగా కష్టపడకుండానే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో నలుగురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు నమోదు చేసి సమిష్టిగా రాణించారు. వెస్టిండీస్‌లో న్యూజిలాండ్‌కి ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా మిచెల్ సాంట్నర్ నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా టామ్ లాథమ్ నిలిచాడు. ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ లాథమ్ (69), డారిల్ మిచెల్ (63)తో కలిసి నాల్గో వికెట్‌కు 120పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్‌ను విజయం అంచులకు చేర్చాడు. అంతకుముందు మార్టిన్ గప్టిల్ (57), డెవాన్ కాన్వే (56) రెండో వికెట్‌కు 82పరుగులు జోడించి న్యూజిలాండ్‌కు మంచి ఛేజింగ్ స్టార్టింగ్ అందించారు.
చివర్లో చిచ్చు రేపిన జిమ్మీ నీషమ్
ఇక 42వ ఓవర్‌లో మిచెల్, 44వ ఓవర్‌లో లాథమ్ ఔట్ కావడంతో కాస్త ఉత్కంఠ రేకెత్తింది. అయితే ఆ టైంలో న్యూజిలాండ్ 43పరుగులు చేయాల్సి ఉండగా.. జిమ్మీ నీషమ్ (11 బంతుల్లో 34 పరుగులు) చిచ్చు రేపే ఆటతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. 'బ్యాటర్లు అందరం మంచి సహకారం అందించడం చాలా ఆనందంగా ఉంది. డారిల్, నేను కలిసి చేసిన భాగస్వామ్యం వెస్టిండీస్‌ను ఒత్తిడిలో పడవేసిందని నేను భావిస్తున్నాను. మేము 40ఓవర్లలో మార్క్‌ను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏదేమైనా మేం గెలిచాం' అని లాథమ్
తొలుత పూరన్ వీరవిహారం
లాథమ్ మొదట బౌలింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్‌కు బ్యాటింగ్లో అదిరిపోయే ఆరంభం దక్కింది. షాయ్ హోప్, కైల్ మేయర్స్ 173పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. కైల్ మేయర్స్ (105 పరుగులు) సెంచరీ చేయగా హోప్ (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక నికోలస్ పూరన్ (55బంతుల్లో 91పరుగులు 4ఫోర్లు, 9సిక్సర్లు) బాది స్కోరుబోర్డును ఓ రేంజులో ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో అల్జారీ జోసెఫ్ (20పరుగులు) దాటిగా ఆడడంతో విండీస్ 300పరుగులు దాటింది. ఇక ఇన్నింగ్స్ ముగిసేసరికి 8వికెట్లు కోల్పోయి 301పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 3, సాంట్నర్ 2, సౌథీ, ఫెర్గుసన్, నీషమ్ తలా ఓ వికెట్ తీశారు.
తుది జట్లు :
వెస్టిండీస్ స్క్వాడ్ : షాయ్ హోప్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, షమర్ బ్రూక్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (కెప్టెన్), కీసీ కార్తీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, కెవిన్ సింక్లెయిర్
న్యూజిలాండ్ స్క్వాడ్ : మార్టిన్ గప్టిల్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications