
మిచెల్, కేన్ టాప్ పెర్ఫామెన్స్
ఈ క్రమంలో 285 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన కివీస్‌కు అంత గొప్ప ఆరంభం లభించలేదు. ఓపెనర్ డెవాన్ కాన్వే (5) విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ (129 నాటౌట్) అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. చూడచక్కని షాట్లతో పట్టదలగా ఆడాడు. అతనికి ఆ తర్వతా జత కలిసిన డారియల్ మిచెల్ (82) రాకతో కివీస్ ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు నిదానంగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు మిచెల్ జీవం పోశాడు. భారీ షాట్లతో లంక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.

చివరి బంతి వరకు ఉత్కంఠ
ఆ తర్వాత తను కూడా బ్యాటు ఝుళిపించిన కేన్ మామ.. గేరు మార్చాడు. చివర్లో కివీస్ విజయానికి చేరువయ్యే కొద్దీ ఉత్కంఠ పెరిగింది. లంక బౌలర్లు టపటపా వికెట్లు కూల్చారు. ఇలాంటి సమయంలో కేన్ మామ మంచి కంపోజర్ చూపించి మ్యాచ్ గెలిపించాడు. చివరి మూడు బంతుల్లో ఐదు పరుగులు అవసరమైన దశలో ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండు బంతులకు బౌన్సర్లు వేసిన లంక బౌలర్ పరుగులు ఇవ్వలేదు. మొదటి బౌన్సర్ వైడ్ అవుతుందని కేన్ మామ అనుకున్నాడు. కానీ అంపైర్ ఇవ్వలేదు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్..
దీంతో రెండో బంతికి కూడా అదే నిర్ణయం రిపీట్ అవ్వొచ్చని భావించిన కేన్ మామ.. బంతి తన బ్యాటును మిస్ అయినా కూడా పరుగు కోసం వెళ్లిపోయాడు. కీపర్ డైరెక్ట్ త్రో వేయడంతో ఫలితంపై టెన్షన్ పెరిగింది. కానీ అద్భుతమైన డైవ్ చేసిన విలియమ్సన్ జట్టుకు విజయం అందించాడు. దీంతో భారత జట్టు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిపోయింది. జూన్ నెలలో ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్ తలపడతాయి. గతేడాది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్.. ఇప్పుడు వరుసగా రెండోసారి ఫైనల్ చేరడం గమనార్హం.


Click it and Unblock the Notifications












