Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS NZ: న్యూజిలాండ్ ప్రత్యేక వ్యూహం - భారత్ మ్యాచ్‌లో ఆ ముగ్గురే టార్గెట్!

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతున్నాయి భారత్ - న్యూజిలాండ్. మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరులో గెలిచిన జట్టే పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్ల నుంచి న్యూజిలాండ్ కు ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే టీమిండియాతో తలపడేందుకు కివీస్ ప్రత్యేక సాధనే చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లైన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్ ను ఎదుర్కొనేందుకు స్పెషల్ ప్రాక్టీస్ చేసిందట. ఇందుకోసం లోకల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ తో కలిసి తీవ్రంగా సాధన చేసిందని తెలిసింది. టామ్‌ లేథమ్‌, ఆల్ రౌండర్ మైకెల్ బ్రాస్‌వెల్‌.. స్పిన్ బౌలింగ్ తో బంతులను ఎదుర్కొన్నారట.

అంతకుముందే న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా మాట్లాడుతూ.. "దుబాయ్‌ పిచ్‌ కాస్త మందకొడిగా ఉంది. బంతి స్పిన్ అవుతుంది. అసలే టీమిండియాలో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు." అని అన్నాడు.

న్యూజిలాండ్ తుది జట్టు ఇదే
రచిన్ రవీంద్ర, విల్ యంగ్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైకెల్ బ్రాస్వెల్, విలియమ్ ఓరూర్కీ, కేల్ జేమీసన్.

టీమిండియా తుది జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), షమీ, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, కుల్డీప్ యాదవ్.

NewZealand practice to face india spinners axar patel jadeja kuldeep ind vs nz champions trophy 2025
Story first published: Sunday, March 2, 2025, 14:39 [IST]
Other articles published on Mar 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+