ఆరోన్ ఫించ్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన న్యూజిలాండ్ క్రికెటర్లు.. నీతో ఆడడం గొప్పగా ఉందన్న కోహ్లీ

కైర్న్స్ : ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆదివారం తన చివరి వన్డే న్యూజిలాండ్‌తో ఆడుతున్నాడు. వన్డే ఫార్మాట్‌కు ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఫించ్ చివరి వన్డేలో బ్యాటింగ్‌కు దిగే టైంలో అతనికి న్యూజిలాండ్ ప్లేయర్ గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అతనికి క్లాస్ వీడ్కోలు అందించారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫించ్ భుజం తట్టి అభినందనలు తెలిపాడు.
ఇకపోతే ఇరు జట్ల మధ్య జరిగే మూడో వన్డే తన చివరి వన్డే మ్యాచ్ అని ఫించ్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ.. టీ20ఫార్మాట్‌లో మాత్రం అతను కొనసాగనున్నాడు. టీ20 కెప్టెన్‌గా జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
చివరి వన్డేలోనూ నిరాశపర్చిన ఫించ్
ఇక తన చివరి వన్డేలోనూ ఫించ్ నిరాశపరిచాడు. 13బంతుల్లో కేవలం 5పరుగులు మాత్రమే చేసిన ఫించ్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ఆశించిన రీతిలో అతని వన్డే చివరి ఇన్నింగ్స్ ముగియలేదు. ఇకపోతే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫించ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఫించ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడినప్పుడు వీరిద్దరు సహచరులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫించ్ తన రిటైర్మెంట్ పోస్ట్ చేయగా.. కోహ్లీ అందుకు స్పందిస్తూ ఫించ్ తన జీవితంలోని తదుపరి దశను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని సూచించాడు.
ప్రత్యర్థిగా, సహచరుడిగా నీతో ఆడడం గొప్పగా ఉంది
'వెల్ డన్ ఫించ్. ఇన్నాళ్లు నీతో పాటు ప్రత్యర్థిగా ఆడడం చాలా గౌరవంగా భావించాను. పైగా ఆర్సీబీ తరఫున ఇరువురం కలిసి ఆడడం కూడా మన మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పింది. ఇక మీ జీవితంలోని తదుపరి దశను పూర్తిగా ఆస్వాదించండి' అని కోహ్లీ తన కామెంట్లో తెలిపాడు. గత కొంతకాలంగా వన్డేల్లో ఫించ్ దారుణంగా విఫలమవుతున్నాడు.
అతను తన చివరి ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో కేవలం 26పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్ 2013లో శ్రీలంకపై ఆసీస్ తరపున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

2019వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ వరకు
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 146వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన ఫించ్.. 5045పరుగులు సాధించాడు. 55వన్డేల్లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా ఫించ్ వ్యవహారించాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలున్నాయి. ఫించ్ కెప్టెన్సీలో 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా... 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ చేరింది. కెప్టెన్‌గా టీ20ల్లో 65 మ్యాచులు ఆడి 35విజయాలు అందుకున్న ఆరోన్ ఫించ్, 52 వన్డేల్లో 28విజయాలు అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications