IND VS NZ: అందరూ తిడుతున్నా.. భారత్‌కు మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్ స్టార్!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోని అన్ని మ్యాచ్ లను టీమిండియా దుబాయ్ లోనే ఆడుతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో న్యూజిలాండ్ కు చెందిన ఓ స్టార్ ప్లేయర్ భారత్ కు మద్దతుగా మాట్లాడాడు. భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ (మార్చి 2) ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న మాజీలు..
పాకిస్థాన్ తో ఉన్న విభేధాల కారణంగా భారత ప్లేయర్లను దాయాది దేశానికి పంపలేదు. దీంతో ఎన్నో సుదీర్ఘ చర్చల అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించి, భారత్ మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ట్రోఫీ ప్రారంభమయ్యాక.. భారత జట్టు వరుసగా అన్ని మ్యాచ్ లను గెలవడంతో కొంతమంది మాజీలు సహా పలువురు అక్కసు వెళ్లగక్కడం ప్రారంభించారు.

దక్షిణాఫ్రికా ప్లేయర్ వాన్‌డర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా అన్ని మ్యాచులను ఒకే వేదికపై ఆడటంతో పిచ్ ను సులువుగా అర్థం చేసుకుని, విజయాన్ని అందుకుంటోందని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో భారత్ ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగిందని విమర్శలు చేస్తున్నారు.
ఎందుకీ అనవసర చర్చ..
ఈ క్రమంలోనే సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ తో పాటు తాజాగా న్యూజిలాండ్ ప్లేయర్ మైకెల్ బ్రేస్‌వెల్ టీమిండియాకు మద్దతుగా నిలిచాడు. అసలు ఎందుకు ఈ విషయంపై చర్చ చేస్తున్నారో తెలియట్లేదన్నాడు. "టీమిండియా దుబాయ్ పిచ్ లపై ఆడాలని ముందే తీసుకున్న నిర్ణయం కదా. సాధారణంగా నేను కొత్త మైదానంలోనే ఆడేందుకు ఆసక్తి చూపిస్తాను. అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ పిచ్‌ను ఎంత తర్వాగ అర్థం చేసుకుంటే అంత మంచిది." అని బ్రేస్‌వెల్ పేర్కొన్నాడు.
Rohit Sharma and Mohammed Shami train ahead of the crucial #ChampionsTrophy clash against New Zealand 🇮🇳 pic.twitter.com/TaDy64s1st
— ICC (@ICC) February 28, 2025
Spirits are high in the New Zealand camp ahead of their #ChampionsTrophy clash against India in Dubai 😍 pic.twitter.com/CFmjsivqax
— ICC (@ICC) February 28, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications