IND VS NZ: ఫైనల్‌లో ఆ 'మాయ' వ్యూహంతో న్యూజిలాండ్ - డేంజర్‌లో భారత్!!
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత స్పిన్నర్లు ఎలా అయితే సత్తా చాటుతున్నారో కివీస్ స్పిన్నర్లు కూడా అలాంటి ప్రదర్శనే చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోనూ కివీస్.. స్పిన్ మ్యాజిక్ తో భారత్ ను దెబ్బ కొట్టాలని చూస్తోంది. దీంతో తుది పోరు... ఇరు జట్ల స్పిన్నర్ల మధ్య పోరులా మారింది. మార్చి 9న దుబాయ్ వేదికగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో.. ఈ ట్రోఫీలో కివీస్ స్పిన్నర్ల ప్రదర్శన ఎలా ఉంది, ఎలాంటి గణాంకాలు నమోదు చేశారు, వారిలో ఎవరి నుంచి భారత జట్టుకు ముప్పు ఉంది వంటి విషయాలను తెలుసుకుందాం...
గ్రూప్ మ్యాచ్‌లో కివీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత్ జట్టు గెలిచినప్పటికీ.. ఒత్తిడిని బానే ఎదుర్కోంది.పైగా స్పిన్నర్ల అదిరే ప్రదర్శనతోనే రీసెంట్ గా భారత్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. అందుకే కివీస్ స్పిన్నర్లను ఈ ఫైనల్ మ్యాచ్ లో తేలిగ్గా తీసుకోలేం. వారిలో ఏక్ దమ్ ఫస్ట్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. ఫిలిప్స్, శాంట్నర్, బ్రాస్‌వెల్, ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర వంటి వారు ఉన్నారు.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిలిప్స్ మినహా మిగతా కివీస్ స్పిన్నర్లు అయితే ఓవర్‌కు ఐదులోపే పరుగులివ్వడం విశేషం. శాంట్నర్ కేవలం 4.85 ఎకానమీ రేట్‌తో 7 వికెట్లు తీశాడు. అతడు బంతిని విపరీతంగా తిప్పకపోయినప్పటికీ.. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. అతడు ఫైనల్ లో భారత్ కు పెద్ద సవాలే విసురుతాడని పలువురు అంచనా వేస్తున్నారు. రచిన్ తో కలిసి భారత బ్యాటర్లకు ఇబ్బందులు సృష్టిస్తాడని భావిస్తున్నారు.
2️⃣brilliant attacks, going all out for #ChampionsTrophy glory 🏆
— ICC (@ICC) March 7, 2025
🇮🇳 v 🇳🇿, whose bowling will come out on top?#INDvNZ pic.twitter.com/AJOgvubzXn
బ్రాస్‌వెల్ ఆఫ్‌స్పిన్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాకిస్థాన్ పిచ్‌లపై మెరుగ్గా రాణించాడు. ప్రస్తుత టోర్నీలో ఇప్పటి వరకు 4.43 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. వరుస సెంచరీలు బాదుతోన్న ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర 4.63 ఎకానమీతో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫిలిప్స్ 7.14 ఎకానమీతో 2 వికెట్లు పడగొట్టాడు.
Back to Dubai for the big dance 🏆 #ChampionsTrophy #CricketNation pic.twitter.com/76Tp43mWpF
— BLACKCAPS (@BLACKCAPS) March 5, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications