For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్రెంట్ బౌల్ట్ షాకింగ్ న్యూస్.. న్యూజిలాండ్ క్రికెట్ నుంచి పర్మిషన్ మంజూరు

Newzealand Bowler Trent Boult Released From Central contract Of NZC

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేవ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి విడుదల చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తద్వారా ట్రెంట్ బౌల్ట్ తన అంతర్జాతీయ కెరీర్లో ఇక న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తరఫున సెంట్రల్ కాంట్రాక్టు నుంచి విడుదలయ్యి ఫ్రీ అయ్యాడు. తద్వారా అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశీయ లీగ్‌లకు అతను అందుబాటులోకి రాబోతున్నాడు. అలాగే తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో కూడా బౌల్ట్ ఈ అర్జీని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ముందుంచాడు.

అయినా అతను ఎంపికవ్వొచ్చు

అయినా అతను ఎంపికవ్వొచ్చు

ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 78 టెస్టులు, 93 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. అతను సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ అయితే అతనికంటూ కొన్ని నిబంధనలుంటాయి. వాటి ప్రకారమే నడుచుకోవాలి. అయితే కాంట్రాక్ట్ నుంచి వైదొలగడంతో.. అతనికి కాస్త స్వేచ్ఛ ఉంటుంది. తాను సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నానని చెబితేనే అతన్ని సెలెక్ట్ చేసే వీలుంటుంది. అలాగే జాతీయ జట్టు మ్యాచ్‌లు ఆడే టైంలో మిగతా టోర్నీల్లో ఆడకూడదనే నిబంధన కూడా అతనిపై ఇక ఉండదు. అయితే అతను కీలక టోర్నీలకు జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు మాత్రం అన్ని అర్హతలుంటాయి.

ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు

ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు

'ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం. ప్రస్తుతం నేను ఈ స్థాయికి చేరుకోవడంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అందించిన మద్దతు ఎనలేనిది. బోర్డు అధికారులకు నా ధన్యవాదాలు. దేశం కోసం క్రికెట్ ఆడాలనేది నా చిన్ననాటి కల. గత 12సంవత్సరాలుగా బ్లాక్ క్యాప్స్‌ జట్టు తరఫున నేను సాధించిన అన్నింటికీ నేను చాలా గర్వపడుతున్నాను. అంతిమంగా నేను తీసుకున్న ఈ నిర్ణయం నా భార్య గెర్ట్, నా ముగ్గురు పిల్లల కోసమే. కుటుంబం ఎప్పుడూ నాకు పెద్ద ప్రేరణనిస్తుంది. క్రికెట్ తర్వాత జీవితానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు' అని బౌల్ట్ పేర్కొన్నాడు.

విచారంగా ఉందన్న న్యూజిలాండ్ బోర్డ్

విచారంగా ఉందన్న న్యూజిలాండ్ బోర్డ్

బోల్ట్ తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్లో 27.49సగటుతో 317 వికెట్లు తీశాడు. వన్డేల్లో 169 వికెట్లు, టీ20ల్లో 62వికెట్లు సాధించాడు. 33ఏళ్ల బోల్ట్ ప్రస్తుతం ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1ర్యాంక్‌లో ఉన్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక బోల్ట్ తీసుకున్న నిర్ణయం పట్ల న్యూజిలాండ్ బోర్డు స్పందించింది. 'మేము ట్రెంట్ స్థానాన్ని గౌరవిస్తున్నాం. అతను నిజాయితీగా మాతో అన్ని విషయాలు తెలియజేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి నిఖార్సైన ప్లేయర్‌ను కోల్పోతున్నందుకు విచారంగా ఉంది. అతని తర్వాత జీవితానికి మా శుభాకాంక్షలు.' అని NZC చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అన్నారు. ట్రెంట్ 2011లో తన టెస్ట్ అరంగేట్రం నుంచి బ్లాక్‌క్యాప్స్‌కు భారీ సహకారం అందించాడని, ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ మల్టీ-ఫార్మాట్ క్రికెటర్లలో ఒకరిగా పేరొందాడని, అతను ఇన్ని ఘనతలు న్యూజిలాండ్ తరఫున సాధించినందుకు గర్విస్తున్నామని చెప్పాడు.

Story first published: Wednesday, August 10, 2022, 15:30 [IST]
Other articles published on Aug 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+