Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England vs Newzealand 3rd test : మిస్టర్ ఓపికవంతుడు డారిల్ మిచెల్ హ్యాట్రిక్ సెంచరీలతో అరుదైన రికార్డులు

Newzealand Batter Daryl Mitchell Hat trick centuries Against England Makes Few Records

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. లీడ్స్‌లోని హెడింగ్లీలో జరిగిన చివరి టెస్టులో అతను మరో సెంచరీ(109పరుగులు 228బంతుల్లో 3ఫోర్లు)తో అదరగొట్టాడు. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 225పరుగులు చేసిన న్యూజిలాండ్.. రెండో రోజు టఫ్ ఫైట్ కొనసాగించింది. 78పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో క్రీజులో అడుగిడిన డారిల్ మిచెల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఇక జాక్ లీచ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో వరుసగా మూడు టెస్టుల్లో మూడు సెంచరీలు నమోదు చేశాడు. మిచెల్ లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 108పరుగులు చేశాడు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 190పరుగుల భారీ నాక్‌ను ఆడాడు. ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 62పరుగులతో నాటౌట్‌గా కూడా నిలిచాడు.

ఇక వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలతో.. మార్క్ బర్గెస్, రాస్ టేలర్, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ తర్వాత టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన అయిదో న్యూజిలాండ్ బ్యాటర్‌గా డారిల్ మిచెల్ నిలిచాడు. ఇకపోతే ఇంగ్లాండ్ మీద వరుసగా మూడు మ్యాచ్‌ల టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా మిచెల్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఇకపోతే ఒకే జట్టుపై వరుసగా మూడు సెంచరీలు సాధించిన న్యూజిలాండ్ బ్యాటర్లలో కెన్ బారింగ్టన్ (1967లో పాకిస్థాన్‌పై), గ్రాహం గూచ్ (1990లో భారత్‌పై) ముందున్నారు. ఇక ఆ విషయంలో ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా డారిల్ మిచెల్ నిలిచాడు.

ఇకపోతే తొలి ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ 35వ ఓవర్‌లో 4వికెట్ల నష్టానికి 83పరుగుల వద్ద క్రీజులోకి వచ్చాడు. జట్టు కష్ట సమయంలో ఉండగా.. జట్టును పటిష్ఠ స్థితికి తీసుకొచ్చాడు. ఆల్ రౌండర్ హెన్రీ నికోల్స్‌తో కలిసి 40పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే విచిత్రంగా నికోల్స్ ఔటయ్యాక టామ్ బ్లండెల్‌ (55)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరు కలిసి 6వికెట్‌కు 120పరుగుల భాగస్వామ్యం అందించారు. చివర్లో సౌతీ (33) సైతం రాణించాడు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5వికెట్లతో చెలరేగాడు. ఇక సీనియర్ అయిన స్టువర్ట్ బ్రాడ్ 3వికెట్లు తీయగా.. మ్యాటీ పాట్స్, జేమీ ఓవర్టన్ తలా ఒక వికెట్ తీశారు.

Story first published: Friday, June 24, 2022, 19:50 [IST]
Other articles published on Jun 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+