Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Newzealand: పాక్ పర్యటనకు జట్టును ప్రకటించిన న్యూజిల్యాండ్

Newzealand announces team for Pakistan tour

పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే జట్టును న్యూజిల్యాండ్ ప్రకటించింది. కేన్ విలియమ్సన్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఈ సిరీస్‌లో జట్టుకు వెటరన్ పేసర్ టిమ్ సౌథీ కెప్టెన్సీ చేయనున్నాడు. అయితే సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమీసన్ కూడా ఈ పర్యటనకు ఎంపిక వలేదు. అదే సమయంలో స్పిన్నర్ ఐష్ సోధి, యువ సంచలనం గ్లెన్ ఫిలిప్స్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.

డబ్ల్యూటీసీ రేసులో లేని జట్లు..

డబ్ల్యూటీసీ రేసులో లేని జట్లు..

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి ఇప్పటికే న్యూజిల్యాండ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గత టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి కప్పు అందుకున్న అయిన కివీస్.. ఈ సారి పెద్దగా రాణించలేదు. స్వదేశంలో బంగ్లా చేతిలో ఒక టెస్టు ఓడింది. అలాగే ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టుల్లోనూ ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే ఫైనల్ చేరే రేసు నుంచి తప్పుకుంది. ఇక పాకిస్తాన్ కూడా ఇంగ్లండ్‌పై వరుసగా రెండు టెస్టులు ఓడటంతో ఈ రేసులో లేకుండా పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ ఈ రేసులో ముందంజలో ఉన్నాయి.

కొత్త కెప్టెన్ మొదటి పరీక్ష..

కొత్త కెప్టెన్ మొదటి పరీక్ష..

పాకిస్తాన్ వంటి జట్టును వారి స్వదేశంలో ఎదుర్కోవడం కష్టమైన పనే. అలాంటి పని కొత్తగా కెప్టెన్‌గా ఎంపికైన టిమ్ సౌథీ ముందు ఉంది. అయితే ఇది ఒక కొత్త ఛాలెంజ్ వంటిదని, కొత్త అనుభవం అందిస్తుందని, దీని కోసం జట్టంతా ఉత్సాహంగా ఎదురు చూస్తోందని న్యూజిల్యాండ్ కోచ్ స్టెడ్ చెప్పాడు. అలాగే ప్రస్తుతం ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను తాము గమనిస్తున్నామని, దాన్ని బట్టే వ్యూహాలు రచిస్తున్నామని వివరించాడు. కివీస్ ఆడే ముల్తాన్, కరాచీ మైదానాల్లో జరిగే మ్యాచులను గట్టిగా ఫాలో అవుతున్నట్లు చెప్పాడు.

 డబ్యూటీసీ సైకిల్‌లో చివరి మ్యాచులు..

డబ్యూటీసీ సైకిల్‌లో చివరి మ్యాచులు..

పాకిస్తాన్‌తో న్యూజిల్యాండ్ జట్టు రెండు టెస్టు మ్యాచులు ఆడుతుంది. ఇవి 2021-23 డబ్ల్యూటీసీ సైకిల్‌లో కివీస్ ఆడే చివరి మ్యాచులు. ప్రస్తుతం ఈ టోర్నీ ఫైనల్ చేరే రేసులో కివీస్ లేదు. న్యూజిల్యాండ్, పాకిస్తాన్ జట్లు డిసెంబరు 26న తొలి టెస్టులో తలపడతాయి. ఈ రెండు టెస్టులు పూర్తయిన తర్వాత మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లో న్యూజిల్యాండ్ జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహిస్తాడు.

 న్యూజిల్యాండ్ జట్టు:

న్యూజిల్యాండ్ జట్టు:

టిమ్ సౌథీ (కెప్టెన్), మెఖేల్ బ్రేస్‌వెల్, టామ్ బండెల్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారియల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, బ్లెయిర్ టికనర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్

Story first published: Thursday, December 15, 2022, 13:48 [IST]
Other articles published on Dec 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+