For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: భారత్‌తో సిరీస్‌కు కివీస్ జట్టు.. నెంబర్ వన్ బౌలర్ లేడుగా..!

Newzealand announces ODI and T20I teams for India Series

కచ్చితంగా ప్రపంచకప్ ఫైనల్ చేరతాయని అనుకున్న రెండు జట్టు.. సెమీఫైనల్‌లో ఓటమి చవిచూసి ఇంటి దారి పట్టాయి. అవే భారత్, న్యూజిల్యాండ్. ఆ బాధ నుంచి తేరుకునేలోపే ఈ రెండు జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్‌ ప్రారంభం అయిపోతోంది. ఈ సిరీస్‌లో ఆడే భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించగా.. న్యూజిల్యాండ్ కూడా తమ జట్టును ప్రకటించింది.

ఇద్దరు సీనియర్లు దూరం..

ఇద్దరు సీనియర్లు దూరం..

టీ20, వన్డే రెండు సిరీస్‌లు ఆడే న్యూజిల్యాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ఇద్దరూ ఈ జట్టులో లేరు. ఇటీవలే బిజీ షెడ్యూల్ నుంచి విశ్రాంతి కోసం కివీస్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బౌల్ట్ వదులుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతన్ని ఈ రెండు సిరీస్‌లకు ఎంపిక చేయలేదు. అదే సమయంలో స్టార్ ఓపెనర్ గప్తిల్‌ను కూడా ఎంపిక చేయకపోవడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

కేన్‌కే ఓటు..

కేన్‌కే ఓటు..

ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో కూడా బ్యాటుతో రాణించని కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సారధిగా తొలగించాలని, గట్టిగా మాట్లాడితే టీ20 ఫార్మాట్‌లో అతన్ని ఆడించవద్దని పలువురు మాజీలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే అతనిపై నమ్మకం ఉంచిన టీం మేనేజ్‌మెంట్.. భారత్‌తో జరిగే రెండు సిరీసుల్లో జట్టు పగ్గాలు అతనికే అందించింది.

జట్టు ఇదే..

జట్టు ఇదే..

ప్రపంచకప్‌లో రాణించిన వారికి ఈ చోటు కల్పిస్తూ న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు ఈ జట్టును ప్రకటించింది. అదే సమయంలో వన్డే వరల్డ్ కప్‌ను కూడా దృష్టిలో ఉంచుకున్నట్లు కనబడుతోంది. అందుకే వన్డేల్లో కీపర్‌గా టామ్ లాథమ్, టీ20ల్లో డెవాన్ కాన్వేలను సెలెక్ట్ చేసింది. అలాగే గ్లెన్ ఫిలిప్స్, ఫిన్ అలెన్‌ కూడా ఈ జట్టులో ఉన్నారు.

కివీస్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (టీ20 వికెట్ కీపర్), లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డేలు మాత్రమే), టామ్ లాథమ్ (వన్డే వికెట్ కీపర్), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్ (మూడో వన్డేకు దూరం), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి (టీ20లకు మాత్రమే), టిమ్ సౌథీ, బ్లెయిర్ టికనర్ (టీ20లకు మాత్రమే).

Story first published: Tuesday, November 15, 2022, 12:36 [IST]
Other articles published on Nov 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+