Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లా చేతిలో ఓటమి: ‘రిప్‌ శ్రీలంక క్రికెట్‌’ పేరిట వార్తా కథనం

హైదరాబాద్: ఉపఖండంలో క్రికెట్ అభిమానుల తీరు వేరు. తమ అభిమాన జట్టు విజయం సాధిస్తే నెత్తిన పెట్టుకుంటారు. అలానే ఓటమి పాలైతే దాడులకు సైతం దిగుతారు. ఇలాంటి సంఘటనలు గతంలో మనం చాలానే చూశాం. తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్టు సిరిస్‌లో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు లంక పర్యటనకు వెళ్లింది. గాలెలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాపై శ్రీలంక విజయం సాధించింది. ఇక కొలంబోలో జరిగిన రెండో టెస్టులో పసికూన బంగ్లా చేతిలో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమిని లంక అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

గతేడాది ఆస్ట్రేలియా జట్టును వైట్ వాష్ చేసిన శ్రీలంక... పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలవడంపై అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శ్రీలంక జట్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఓటమిపై ఆటగాళ్ల వైఫల్యంపై మీడియాలో రకరకాలుగా కథనాలు కూడా ప్రచురించారు.

రిప్‌ శ్రీలంక క్రికెట్‌ పేరిట వార్తా కథనం

రిప్‌ శ్రీలంక క్రికెట్‌ పేరిట వార్తా కథనం

అయితే సోమవారం స్థానిక వార్తా పత్రిక ‘రిప్‌ శ్రీలంక క్రికెట్‌' పేరిట రాసిన ఓ కథనం ఇప్పుడు సంచలనం అయింది. అందులో 2017మార్చి 19న ఒవల్‌లో శ్రీలంక క్రికెట్‌ చనిపోయిందంటూ రాసుకొచ్చింది. శ్రీలంక క్రికెట్‌ దహనం పూర్తైందని, బూడిదను బంగ్లాదేశ్‌ తీసుకెళ్లాలంటూ సూచించింది.

సోషల్ మీడియాలో కార్టూన్‌ వైరల్

సోషల్ మీడియాలో కార్టూన్‌ వైరల్

అందుకు సంబంధించి ఓ కార్టూన్‌ను కూడా వేసింది. ఈ కార్టూన్‌లో ‘శ్రీలంక క్రికెట్‌' శవపేటికను శ్రీలంక క్రికెట్‌ అధ్యక్షుడు, క్రీడల మంత్రి మోస్తున్నట్లుగా ఉంది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మార్చి 15 నుంచి 19 వరకు ఓవల్‌ మైదానంలో రెండో టెస్టు జరిగింది. ఇది బంగ్లాదేశ్‌కి 100వ టెస్టు కావడం విశేషం.

రెండో టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి

రెండో టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి

ఈ టెస్టులో బంగ్లాదేశ్‌ చేతిలో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమమైంది. ఈ టెస్టులో 100 డిస్మిసల్స్ చేసిన తొలి బంగ్లాదేశ్ వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇందులో 88 క్యాచ్‌లు కాగా, మరో 12 స్టంప్‌ అవుట్లు ఉన్నాయి.

రెండో టెస్టులో ముష్ఫికర్ అరుదైన ఘనత

రెండో టెస్టులో ముష్ఫికర్ అరుదైన ఘనత

ప్రస్తుతం కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ముష్ఫికర్ ఈ ఘనత సాధించాడు. ముష్ఫికర్ తర్వాత అత్యధిక డిస్మిసల్స్ చేసిన బంగ్లా క్రికెటర్‌గా ఖలీద్ మసూద్ (87) రెండో స్థానంలో నిలిచాడు. 28 ఏళ్ల ముష్ఫికర్ రహీం బంగ్లాదేశ్ తరుపున ఇప్పటివరకు 54 టెస్టులు మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+