
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ ఏడాది మరుపురాని ఏడాది. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. కెప్టెన్‌గా మైదానంలో దూకుడుని ప్రదర్శిస్తూ... జట్టుని ముందుండి నడిపించాడు. మూడు ఫార్మెట్లలో కలిపి ఈ ఏడాది విరాట్ కోహ్లీ మొత్తం 2818 పరుగులు నమోదు చేశాడు.
తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్ధానంలో నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీకంటే ముందు శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర, ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్‌లు మాత్రమే ఉన్నారు. అంతేకాదు 2017లో విరాట్ కోహ్లీ 6 సెంచరీలు నమోదు చేశాడు.
దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్ధానంలో నిలిచాడు. వన్డేల్లో కోహ్లీ (32) సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (49) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇక, కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు.
ఈ ఏడాది కోహ్లీ ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (13) అగ్రస్ధానంలో ఉన్నాడు. క్రికెట్‌ను పక్కనబెడితే కోహ్లీకి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.