
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన జీవితంలో మరిచిపోలేని సంవత్సరం ఏదైనా ఉంది అంటే అది 2017 మాత్రమే. ఈ ఏడాది రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లి కోసం శ్రీలంక సిరిస్‌కు విశ్రాంతి కోరడంతో అతని స్ధానంలో రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
తాను కెప్టెన్సీ వహించిన తొలి వన్డే సిరిస్‌లో డబుల్ సెంచరీతో క్రికెట్ అభిమానులను అలరించాడు. తద్వారా వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు.
అంతేకాదు ఐసీసీ వన్డే రాంకుల్లో సైతం మొట్టమొదటిసారి టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.