న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్..ఆ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ కేరీర్‌ను దెబ్బకొట్టిందా? అతని స్థానంలో కొత్త ప్లేయర్

WI vs NZ: Romario Shepherd to replace Dwayne Bravo in West Indies squad for New Zealand tour

సెయింట్ జాన్స్: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కేరీర్‌ చరమాంకానికి వచ్చిందా? ఐపీఎల్-2020 సీజన్‌ మ్యాచ్‌లో అతను గాయపడటం.. అతని కేరీర్‌పై ప్రభావాన్ని చూపిస్తోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. న్యూజీలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లే వెస్టిండీస్ క్రికెట్ జట్టులో డ్వేన్ బ్రావోకు చోటు దక్కలేదు. అతని స్థానంలో కొత్త ఆటగాడు రొమారియో షెప్పర్డ్‌ను ఎంపిక చేసింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. న్యూజీలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లే జట్టులో బ్రావో స్థానంలో షెప్పర్డ్‌ను తీసుకుంది.

మూడు ఫార్మట్లలోనూ..

వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో న్యూజీలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. వచ్చేనెల 27వ తేదీన కివీస్ టూర్ ప్రారంభమౌతోంది. రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఆడుతుంది విండీస్ టీమ్. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఇందులో షెడ్యూల్ చేయలేదు. దీనికోసం ఈ రెండు ఫార్మట్లకూ వేర్వేరుగా జట్టును ఎంపిక చేసింది. ఈ రెండింటో ఏ ఫార్మట్‌లోనూ డ్వేన్ బ్రావో ఎంపిక కాలేదు. టీ20 స్పెషలిస్ట్ డ్వేన్ బ్రావో స్థానంలో రొమారియో షెప్పర్డ్‌ను జట్టులోకి తీసుకుంది.

జట్టులో చోటు దక్కకపోవడం పట్ల..

జాతీయ జట్టులో తనకు చోటు దక్కకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేశాడు డ్వేన్ బ్రావో. న్యూజీలాండ్ పర్యటనకు వెళ్లాలనే ఉత్సాహంలో ఉన్నానని, గాయం వల్ల తప్పుకోవాల్సి వస్తోందని చెప్పాడు. మెరూన్ కలర్ జెర్సీని ధరించాలనే కలను గాయం నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కాబోతోందని, దీనికోసం విండీస్ జాతీయ జట్టు సన్నాహాలు చేస్తోందని, అందులో తాను భాగస్వామిని కాలేకపోవడం బాధ కలిగిస్తోందని అన్నాడు. గాయం వల్ల ఒక్క ఐపీఎల్ టోర్నమెంట్‌కే కాకుండా కివీస్ టూర్‌కు కూడా ఎంపిక కాలేకపోతున్నానని చెప్పాడు.

ప్రపంచకప్ నాటికి పుంజుకొంటా..

ప్రపంచకప్ నాటికి పుంజుకొంటా..

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నాటికి తాను పుంజుకొంటానని డ్వేన్ బ్రావో ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ట్రినిడాడ్‌లో తాను చికిత్స తీసుకుంటానని చెప్పాడు. ఐపీఎల్-2020లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో డ్వేన్ బ్రావో గాయపడ్డ విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో అర్ధాంతరంగా మైదానాన్ని వీడిన అతను మళ్లీ వెనక్కి రాలేకపోయాడు. ఇక ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి ఆడే నాలుగు మ్యాచ్‌లకూ అతను అందుబాటులో ఉండట్లేదని జట్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ సైతం స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో బ్రావో స్వదేశానికి వెళ్లనున్నాడు.

ఎవరీ రొమారియో షెప్పర్డ్..

రొమారియో షెప్పర్డ.. గయానాకు చెందిన క్రికెటర్. స్పెషలిస్ట్ బౌలర్. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. ఇప్పటిదాకా వెస్టిండీస్ జాతీయ జట్టు తరఫున అయిదు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఆడాడు. రెండు టీ20ల్లో జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించాడు. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయిదు వన్డేల్లో నాలుగు వికెట్లను పడగొట్టాడు. రెండు టీ20ల్లో రెండు వికెట్లు తీసుకున్నాడు. న్యూజీలాండ్ పర్యటనకు తనను ఎంపిక చేయడం పట్ల అతను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. న్యూజీలాండ్ వంటి ఓ ప్రొఫెషనల్ సిరీస్‌కు ఎంపిక కావడం అతనికి ఇదే తొలిసారి.

Story first published: Thursday, October 22, 2020, 10:04 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X