భారత క్రికెటర్లకి దొరికిన విశ్రాంతి మంచిదే.. ఎందుకంటే?!!

ముంబై: భారత్‌లో అన్ని క్రికెట్ మ్యాచ్‌లు రద్దు అవడంతో ఆటగాళ్లకు మంచే జరుగనుందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లకు సరైన సమయంలో తగినంత విశ్రాంతి లభించిందన్నాడు. కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రీడా ఈవెంట్‌లు రద్దు కావడంతో తొలుత షాక్‌కు గురయ్యామన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ నుంచి దాదాపు 10 నెలల పాటు భారత్ జట్టు వరుసగా సిరీస్‌లు ఆడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బిజీ షెడ్యూల్‌పై పెదవి విరిచిన విషయం తెలిసిందే.

విశ్రాంతి మంచిదే:
తాజాగా ఓ మీడియాతో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'భారత క్రికెటర్లకి దొరికిన విశ్రాంతి మంచిదే. ఎందుకంటే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో సుదీర్ఘ సిరీస్ (టీ20, వన్డే, టెస్ట్)లు ఆడారు. ముఖ్యంగా మూడు ఫార్మాట్ల ఆడిన క్రికెటర్లు మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయారు. గత 10 నెలల నుంచి టీమిండియా వరుసగా సిరీస్‌లు ఆడుతూనే ఉంది. కాబట్టి ఈ బ్రేక్ ద్వారా మళ్లీ క్రికెటర్లు ఫ్రెష్‌గా చార్జ్ అవుతారు' అని అన్నాడు.

మొదటగా షాక్‌కు గురయ్యాం:
'కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రీడా ఈవెంట్‌లు రద్దు కావడంతో మొదటగా షాక్‌కు గురయ్యాం. దక్షిణాఫ్రికాతో రెండో వన్డే ఆడే సమయానికి ఉన్న పళంగా సిరీస్ రద్దయ్యింది. ఆ తర్వాత కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందడంతో భారత్ ఆడే అన్ని టోర్నీలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సఫారీల రెండో వన్డే తర్వాతే చాలా టోర్నీలు రద్దు అవుతాయనే విషయం క్రికెటర్లకు అర్ధమైంది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇంటి వద్ద గడిపిన రోజులు 20లోపే:
ఒకవైపు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడం, మరోవైపు మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదా వేయడంతో అప్పటి వరకూ క్రికెటర్లకి విశ్రాంతి దొరకనుంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో.. ఇంటి వద్దే ఉంటున్న ఆటగాళ్లు తమతమ కుటుంబాలతో సరదాగా గడపడమే కాకుండా.. ఫిట్‌నెస్‌ని మెరుగుపర్చుకునే పనిలో ఉన్నారు. 2019 జులై నుంచి వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న భారత క్రికెటర్లు.. ఈ మార్చి మూడో వారం వరకూ ఇంటి వద్ద గడిపిన రోజులు 20లోపే ఉంటాయి.

10 నెలల పాటు వరుసగా సిరీస్‌లు:
2019 వన్డే ప్రపంచకప్ నుంచి దాదాపు 10 నెలల పాటు భారత్ జట్టు వరుసగా సిరీస్‌లు ఆడింది. విండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, విండీస్ సిరీసులను గతేడాది ఆడింది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లి ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌ని ఆడింది. ఆపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications