కరోనాపై బ్రావో పాట.. వైరస్‌పై పోరాదామని పిలుపు (వీడియో)!!

గయానా: కరోనా వైరస్ మహమ్మారి కోరల్లో చిక్కుకొని అగ్ర రాజ్యాలు సైతం తల్లడిల్లిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చైనాతో పాటు అమెరికా, ఇంగ్లండ్, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ లాంటి దేశాలు భీతావాహ పరిస్థితుల్లోకి జారిపోయాయి. మరోవైపు అనేక దేశాలు లాక్‌డౌన్‌లు ప్రకటించినా.. రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27 వేల మందికి పైగా మృత్యువాత పడగా.. సుమారు ఆరు లక్షల మందికి కరోనా సోకింది.

కరోనాపై బ్రావో పాట:
కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో వైరస్‌పై అవగాహన కల్పించడానికి అనేక మంది క్రీడాకారులు సామాజిక మాధ్యమాల్లో తమవంతు కృషిచేస్తున్నారు. వివిధ రూపాల్లో వైరస్‌పై ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనాపై అవగాహన కల్పించేందుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వైన్ బ్రావో ఓ పాటను విడుదల చేశాడు. స్వయంగా తానే పాట పాడి డ్యాన్స్ చేశాడు. కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. అందరూ ఇండ్లలోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాంటూ సూచించాడు.

మస్కారంతో పాట ఆరంభం:
'వీ ఆర్ నాట్ గివింగ్ అప్' పేరిట బ్రావో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటను శనివారం పోస్ట్ చేశాడు. నమస్కారంతో బ్రావో పాటను ప్రారంభించడం విశేషం. ఇదివరకే ఎన్నోసార్లు బ్రావో తన గాత్రం, నృత్యంతో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఏడాది తర్వాత బ్రేవో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్న విషయం తెలిసిందే. బ్రేవో 2018 అక్టోబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. సెప్టెంబర్ 2016లో పాకిస్థాన్‌పై చివరి టీ20 ఆడాడు. 2012, 2016ల్లో విండీస్ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో సభ్యుడు.
సోమ్‌దేవ్ కూడా:
భారత టెన్నిస్ మాజీ ప్లేయర్ సోమ్‌దేవ్ దెవర్మన్ కరోనాపై పాట రాశాడు. హృదయాన్ని హత్తుకునేలా సాగిన ఆ పాటను సోమ్‌దేవ్ ట్విటర్‌లో పోస్టు చేశాడు. 'ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటే.. నేనేమి చేయను?' అంటూ సాగే ఆ పాట నెటిజెన్లను ఆకర్షిస్తోంది. అంతకుముందు న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోధి సైతం కరోనాపై ఓ ర్యాంప్ సాంగ్ పాడాడు. 'కరోనా వైరస్ ఈ రోజు నా వద్దకు రావొద్దు.. కరోనా వైరస్ నేనింకా క్రికెట్ ఆడేది ఉంది' అంటూ తన భావాలను వ్యక్తపరిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications