Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతిథులు ఏం చేశారంటే! ఒకవైపు పెళ్లి... మరొవైపు ఐపీఎల్ ఫైనల్ (వీడియో)

 Newlyweds sidelined at their own wedding as guests watch IPL final

హైదరాబాద్: పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులు మండపంలో పెళ్లి జరుగుతుంటే దానిని పట్టించుకోకుండా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ వీక్షించే క్రమంలో తాము పెళ్లికి వచ్చామన్న సంగతిని కూడా మరిపోయారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మే12న పెళ్లి కావడంతో అతిథులు కోసం పెళ్లి కొడుకు మ్యాచ్‌ని వీక్షించేలా మండపం పక్కన పెద్ద స్క్రీన్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడం... ఆది కూడా ముంబై vs చెన్నై జట్ల మధ్య జరుగుతుండటంతో పెళ్లికి వచ్చిన అతిథులంతా మ్యాచ్‌ను చూస్తుండిపోయారు.

కాగా, హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చెన్నై విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో శార్దూల్ ఠాకూర్ బౌల్ట్ కావడంతో ముంబై విజయం సాధించింది.

ముంబై విజయం సాధించడంతో పెళ్లికి వచ్చిన అతిథులంతా మ్యాచ్‌ను తిలకిస్తూ బ్యాండ్ చప్పుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ నాలుగు ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

Story first published: Friday, May 17, 2019, 16:59 [IST]
Other articles published on May 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+