హనీమూన్ మానుకొని.. ‘హీరో’ అయ్యాడు: లంక సంచలనం అఖిల(పిక్చర్స్)
కొలంబో: భారత్-శ్రీలంక రెండో వన్డేలో ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించిన 24ఏళ్ల
లంక బౌలర్ అఖిల ధనంజయకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్ ఆటగాళ్లనూ తన పదునైన బంతులతో బెంబేలెత్తించాడు ఈ బౌలర్.
అసలు విషయమేంటంటే.. హనీమూన్‌కు వెళ్లాల్సిన ఈ స్పిన్నర్.. పెళ్లి జరిగిన రోజు రాత్రే శ్రీలంకకు చేరుకోవడం గమనార్హం. అంతేగాక, అద్భుతమైన ప్రదర్శనతో లంక పరువు నిలబెట్టే ప్రయత్నం చేశాడు.

ముందు రోజే పెళ్లి..
పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండో వన్డే జరగడానికి ముందు రోజే తన సొంతూరు మోరత్వాలో చిన్ననాటి స్నేహితురాలు నితాలి టెక్షిణితో అఖిల ధనంజయకి వివాహం జరిగింది. అలాంటి సమయంలో ఏ భర్తయినా తన భార్యతో సరదాగా గడపాలనుకోవడం సాధారణమే విషయమే.

ఆ రాత్రికే...
కాగా, పెళ్లయిన మరుసటి రోజు ధనంజయ తన భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, అనుకోకుండా శ్రీలంక టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి పిలుపు రావడంతో మరుసటి రోజే మ్యాచ్ ఆడేందుకు ఆ రాత్రికే క్యాండీలోని హోటల్‌లో బసచేస్తున్న లంక జట్టుతో చేరిపోయాడు.

మరిచిపోలేని రోజుగా..
విశేషమేంటంటే తన భర్త ఆటను ఆస్వాదించేందుకు భార్య నితాలి గ్యాలరీలో ప్రత్యక్షమైంది. భార్య తన ఆటను చూస్తుండటం.. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లను వరుసపెట్టి పెవిలియన్ పంపడం.. అతడి జీవితంలో మరచిపోని రోజుగా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పోరాటం వృథానే...
రెండో వన్డేలో ఆరు వికెట్లు తీసి టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన ధనంజయ పోరాటం మాత్రం వృథాగానే మిగిలింది. ఛేదనలో ధనంజయ(6/54) సంచలన బౌలింగ్ దెబ్బకు ఓ దశలో 131/7తో ఉన్న స్థితిలో మహేంద్రసింగ్ ధోనీ, భువనేశ్వర్ కుమార్ జోడీ అనూహ్య పోరాడటంతో భారత్ విజయం సాధించింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
అయితే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం ధనంజయనే వరించింది. అద్భుతమైన ఆటతీరు కనబర్చినందుకుగాను ప్రస్తుతం సోషల్ మీడియాలో విభిన్న వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు ధనుంజయ. హనీమూన్‌ను కూడా రద్దు చేసుకుని తన జట్టు గెలుపుకోసం పోరాటం చేయడం పట్ల లంక అభిమానులు కొనియాడుతున్నారు.

గెలిస్తే హ్యాపీగా ఉండేది..
తన కెరీర్‌లో ఆరు వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబర్చినప్పటికీ తనకు ఆనందం లేదని అఖిల ధనంజయ అన్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు గెలిచివుంటే తనకు ఎంతో ఆనందంగా ఉండేదని చెప్పాడు. తమ జట్టు ఓటమి తనను నిరాశకు గురిచేసిందని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications