BAN vs NZ Toss: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు నేడు రావల్పిండి వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమే. న్యూజిలాండ్ సెమీస్ కు దగ్గరగా వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. బంగ్లాదేశ్ టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. ఈ మ్యాచ్ ఓడితే బంగ్లాదేశ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కీలక మార్పులు చేశాయి. బంగ్లాదేశ్ జట్టులోకి మహ్మదుల్లా తిరిగి వచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్ చాలా అవసరం కాబట్టి అతడిని బంగ్లాదేశ్ జట్టులోకి తీసుకువచ్చారు. నహిద్ రాణాను కూడా జట్టులోకి తీసుకున్నారు. సౌమ్య సర్కార్, తంజిద్ షకీబ్ ను ఈ మ్యాచ్ లో పక్కన పెట్టారు. న్యూజిలాండ్ జట్టులో కూడా కీలక మార్పులు జరిగాయి. నాథన్ స్మిత్ స్థానంలో కైల్ జేమిసన్, మరో క్రికెటర్ స్థానంలో రచిన్ రవీంద్ర తిరిగి జట్టులోకి వచ్చారు.

జట్లు ఇలా..
న్యూజిలాండ్ జట్టు: విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్కే
బంగ్లాదేశ్ జట్టు: తంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(c), మెహిదీ హసన్ మిరాజ్, తోహిద్ హ్రిడోయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, ముస్తాఫిజుర్ రెహ్మాన్