Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3rd T20I: టీమిండియా విజయ లక్ష్యం 162

New Zealand women score 161-7 against India in 3rd T20I

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా హామిల్టన్ వేదికగా ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ భారత మహిళల జట్టుకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టులో ఓపెనర్‌ సోఫి డెవిన్‌ (72) హాఫ్‌ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో దీప్తీ శర్మకు రెండు వికెట్లు దక్కగా.. మాన్సీ జోషి, రాధా యాదవ్‌, అరుంధతి రెడ్డి, పూనమ్‌ యాదవ్‌లకు తలో వికెట్‌ దక్కింది. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే వరుస రెండు టీ20లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్నన్యూజిలాండ్ మహిళల జట్టు అదే జోరుతో చివరి మ్యాచ్‌ను గెలిచి భారత్‌ను వైట్‌వాష్‌ చేయాలని భావిస్తోంది.

మరోవైపు భారత మహిళలు మాత్రం ఈ మ్యాచ్‌లో విజయం సాధించి వైట్‌వాష్‌ తప్పించుకోవాలని చూస్తోంది. మూడో టీ20లో కూడా వెటరన్‌ మిథాలీరాజ్‌ మరోసారి బెంచ్‌కే పరిమితమైంది. భారత జట్టు ఎక్కువగా స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లపై అతిగా ఆధారపడుతోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ పర్యటనలో స్థాయికి తగ్గ ఇన్నింగ్సే ఆడలేదు.

జట్ల వివరాలు:
భారత్‌
: ప్రియాపూనియా, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), మిథాలీ రాజ్‌, దీప్తి శర్మ, తానియా భాటియా, అరుంధతిరెడ్డి, రాధా యాదవ్‌, మాన్షి జోషి, పూనమ్‌ యాదవ్‌

న్యూజిలాండ్‌: సోషి డెవిన్‌, సుజీ బెట్స్‌, అమీ సట్టెర్‌వైట్‌ (కెప్టెన్‌), కెటీ మార్టిన్‌, అన్నా పీటర్సన్‌, కాస్పెర్క్‌, అమెలియా కెర్‌, రోస్‌మెరీ మైర్‌, హైలే జెన్సన్‌, లీ తాహుహు, హన్నా రోవ్‌

Story first published: Sunday, February 10, 2019, 10:54 [IST]
Other articles published on Feb 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+