జుగుప్సాకరమైన ఫొటోతో విరాట్ కోహ్లీని అవమానపర్చిన కివీస్ వెబ్‌సైట్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో తలపడిన భారత జట్టుకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మెగా ఫైనల్లో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా... అద్భుత ఆటతీరుతో కేన్ విలియమ్సన్ సేన విశ్వవిజేతగా నిలిచింది. గత రెండేళ్లుగా జరిగిన ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా కీలక ఫైనల్లో మాత్రం తడబడింది.

అయితే, ఈ ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్నారని, కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదని మండిపడుతున్నారు. అంతేకాకుండా భారత ఓటమికి విరాట్ కోహ్లీ చెత్త కెప్టెన్సీనే కారణమని, జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

జెమీసన్ కీలు బొమ్మ..

అయితే భారత అభిమానుల ఆగ్రహానికి కారణం ఉండొచ్చు. కానీ, న్యూజిలాండ్ ప్రముఖ వెబ్ సైట్.. విరాట్ కోహ్లీని ఘోరంగా అవమానించింది. TheAccNZ అనే ఆ వెబ్‌సైట్ పెట్టిన ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫొటో విరాట్ కోహ్లీని అత్యంత దారుణంగా అవమానించేలా ఉంది. ఇంతకీ అందులో ఏం ఉందంటే. ఒక మహిళ.. బెల్ట్‌తో ఓ మనిషిని పట్టుకుని ఉంటుంది. ఆ మహిళను కైల్ జేమీసన్‌గా పోల్చిన సదరు వెబ్‌సైట్.. ఆ మనిషిని విరాట్ కోహ్లీతో పోల్చింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడని, అతని చేతిలో కీలు బోమ్మ అయ్యాడనే అర్థంలో ఆ వెబ్‌సైట్ ఈ పోస్ట్ పెట్టింది.

 మంచివాళ్లనుకుంటే..

మంచివాళ్లనుకుంటే..

అయితే, ఈ పోస్ట్ పై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను ఇలా అవమానించడం తగదని హెచ్చరిస్తున్నారు. ఈ ఫోటో భారత్‌లో వైరల్ అయితే.. సదరు వెబ్ సైట్ నామారూపాలు లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి కొందరు అయితే.. న్యూజిలాండ్ గ్రౌండ్ లోపల..బయటా చాలా మర్యాదగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ చర్యతో వాళ్ల ప్రతిష్టను దిగజార్చుకున్నారు. ఇంకొంత మంది ఫ్యాన్స్ అయితే.. కైల్ జెమీసన్‌ను మహిళతో పోల్చుకుని తమను తామే దిగజార్చుకున్నారని కౌంటర్ వేస్తున్నారు.

ప్చ్.. ఒక్క ఐసీసీ టైటిల్ లేదు..

ప్చ్.. ఒక్క ఐసీసీ టైటిల్ లేదు..

మరోవైపు, టీమిండియాకు ఐసీసీ ఈవెంట్లు కలిసి రావడం లేదు.2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు ఇంత వరకు మరో ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. అదే సమయంలో ఏడు సార్లు ఫైనల్స్‌కు చేరుకొని మరి ఓటమిని కొని తెచ్చుకుంది. ప్లేఆఫ్స్, నాకౌట్ దశకు సులభంగానే చేరుకుంటున్న టీమిండియాకు చివరి మొట్టుపై బోల్త పడటం అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత ఇది మరి ఎక్కువైంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. అందుకే కోహ్లీకి కెప్టెన్‌గా ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా లేకుండా పోయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 25, 2021, 19:35 [IST]
Other articles published on Jun 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X