
హైదరాబాద్: న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి జరగనున్న వన్డే సిరిస్‌కి వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. క్రిస్ గేల్ రాకతో ప్రత్యర్ధి న్యూజిలాండ్ జట్టులో కంగారు మొదలైందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
ఇటీవల వెస్టిండిస్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరిస్‌కి సెలక్టర్లు క్రిస్ గేల్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. గత వారం ముగిసిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో క్రిస్ గేల్ సెంచరీలో అలరించిన సంగతి తెలిసిందే.
69 బంతుల్లోనే 18 సిక్సర్ల సాయంతో 146 పరుగులు బాదిన క్రిస్ గేల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో మూడు వన్డేల సిరిస్‌లో కివీస్ బౌలర్లకు కష్టాలు తప్పవనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ మీడియాతో మాట్లాడాడు.
'స్ధానిక పరిస్థితులను ఆకలింపుచేసుకోవడానికి క్రిస్ గేల్ కొంత సమయం పడుతుంది. క్రిస్‌గేల్ ఎంత విధ్వంసక హిట్టరో అందరికీ తెలుసు. అతనికి అవకాశం దొరికితే భారీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. దీనికి తోడు గత కొంతకాలంగా అతను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు' అని అన్నాడు.
'అయితే మా జట్టులోని పేసర్లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ బంతిని చక్కగా స్వింగ్ చేయగలరు. వారు తప్పకుండా క్రీజులో గేల్ కుదురుకునేలోపే పెవిలియన్‌కి పంపిస్తారు. అలా జరగని పక్షంలో మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుంది' అని ఫెర్గూసన్ ధీమా వ్యక్తం చేశాడు.
గాయం కారణంగా వెస్టిండిస్ సీనియర్ బ్యాట్స్‌మెన్ మార్లోన్ శ్యామ్యూల్స్ జట్టుకి దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకుల్లో తొమ్మిదో స్ధానంలో ఉన్న వెస్టిండిస్, ఐదో ర్యాంకులో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. గాయం కారణంగా మార్టిన్ గుప్తిల్, తండ్రి చనిపోయిన కారణంగా కోలిన్ డీ గ్రాండ్‌హోమ్‌లు వన్డే సిరిస్‌కు దూరమయ్యారు.
న్యూజిలాండ్:
Kane Williamson (captain, first ODI only), Todd Astle, Trent Boult, Doug Bracewell, Lockie Ferguson, Matt Henry, Tom Latham (captain, second and third ODIs), Adam Milne, Colin Munro, Henry Nicholls, Tim Southee (first ODI only), Ross Taylor, George Worker, Neil Broom (second and third ODIs), Mitchell Santner (second and third ODIs)
వెస్టిండిస్:
Jason Holder (captain), Jason Mohammed, Shimron Hetmyer, Ronsford Beaton, Shannon Gabriel, Chris Gayle, Kyle Hope, Shai Hope, Sheldon Cottrell, Evin Lewis, Nikita Miller, Ashley Nurse, Rovman Powell, Chadwick Walton, Kesrick Williams.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.