Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్ బ్యాటింగ్: సెమీస్ బరిలో నిలవాలంటే విండిస్ గెలవాల్సిందే!

 New Zealand vs West Indies Live Score, World Cup 2019: Jason Holder wins toss, WI to bowl first

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు వెస్టిండిస్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విండిస్ మూడు మార్పులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆండ్రీ రస్సెల్, గాబ్రియేల్, బ్రావో స్థానంలో బ్రాత్ వైట్, కీమర్ రోచ్, ఆష్లే నర్స్‌లకు తుది జట్టులో చోటు కల్పించినట్లు జాసన్ హోల్డర్ తెలిపాడు. మరోవైపు న్యూజిలాండ్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. సెమీఫైనల్ రేసులో నిలువాలంటే వెస్టిండిస్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.

1
43672

మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి టోర్నీని ఘనంగా ఆరంభించిన విండీస్... ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ల చేతిలో ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ రద్దవడమూ ఆ జట్టుకు నిరాశ కలిగించి.. సెమీస్ అవకాశాలను క్లిష్టంచేసింది. ఐదు మ్యాచ్‌ల తర్వాత విండీస్ 3 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

{headtohead_cricket_4_8}

మరోవైపు అన్ని విభాగాల్లో రాణిస్తూ న్యూజిలాండ్ ఐదు మ్యా‌చ్‌ల్లో నాలుగింట విజయం సాధించి(ఒకటి రద్దు) రెండో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Saturday, June 22, 2019, 18:01 [IST]
Other articles published on Jun 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+