Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విండీస్‌ని తుడిచి పెట్టి పడేసిన కివీస్: న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్

New Zealand Vs West Indies: Kiwis sweep Windies with 240-run victory

హైదరాబాద్: న్యూజిలాండ్-వెస్టీండీస్ టెస్ట్ మ్యాచ్‌ డిసెంబరు 12న ముగిసింది. ఈ ఫైనల్ మ్యాచ్‌ లో 240పరుగులు తీసిన న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. 203 పరుగులతో వెస్టీండీస్ ఆలౌట్ అయింది. హ్యామిల్టన్‌లోని సేడన్ పార్క్ వేదికగా జరిగిన వేడుకలో వెస్టిండీస్ చివర వరకు పోరాడి పరాజయం పాలైంది.

న్యూజిలాండ్ బౌలర్ అయిన మిచెల్ సాంటర్ (2/13)గా ఆడి వెస్టీండీస్‌ని ఇరకాటంలో పెట్టాడు. మొత్తం సిరీస్‌కు 444 లక్ష్యంతో వెస్టీండీస్ క్రీజులోకి అడుగుపెట్టింది. బ్లాక్ క్యాప్ విన్నర్ బౌలర్స్‌లో నీల్ వాగ్నర్ ప్రత్యర్థి జట్టుకు చుక్కుల చూపించాడు. (3/42)గా స్కోరును ఎక్కువ కాకుండా బౌలింగ్‌తో తికమకపెట్టాడు. ఇతనితోపాటుగా ట్రెంట్ బోల్ట్ (2/52), టిమ్ సౌతీ (2/71) తన వంతు స్థాయిలో ఆటను నిలబెట్టారు. ఈ మ్యాచ్‌తో ట్రెంట్ బౌల్డ్ 200 టెస్ట్ వికెట్‌లు తీసిన ఘనత పొందాడు.

వెస్టీండీస్ ఆటగాడు ఆంబ్రిస్ అవుట్ అయ్యే సమయానికి టీం స్కోరు 80-4 వికెట్లుగా ఉంది. రెండు బంతుల అనంతరం షేన్ డౌరిచ్ డకౌట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రోస్టన్ చేజ్(64), రేమన్ రీఫర్ (29)భాగస్వామ్యంతో 78 పరుగుల వరకు చేశారు. వెస్టీండీస్ ఎంత కష్టపడి ఆడినప్పటికీ న్యూజిలాండ్ సునాయాసంగా విజయాన్ని చేజిక్కుంచుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 12, 2017, 13:27 [IST]
Other articles published on Dec 12, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+