For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వన్డేలో ఓటమి: క్రిస్‌గేల్ ఉన్న మారని విండిస్ తలరాత

By Nageshwara Rao
New Zealand Vs West Indies, 1st ODI: Black Caps beat Windies

హైదరాబాద్: విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ జట్టులో చేరినా... వెస్టిండిస్ తలరాత మాత్ర మారలేదు. న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌ను 0-2తో చేజార్చుకున్న వెస్టిండిస్ తాజాగా బుధవారం జరిగిన తొలి వన్డేలోనూ 5 వికెట్లు తేడాతో ఓటమి పాలైంది.

వెస్టిండిస్ Vs న్యూజిలాండ్ తొలి వన్డే స్కోరు కార్డు

గత వారం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ (బీపీఎల్) ఫైనల్లో సెంచరీతో చెలేరిన క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌లో (22; 3ఫోర్లు, ఒక సిక్సు) పరుగులకే తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ పేసర్లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ మ్యాచ్ ఆరంభం నుంచే క్రిస్‌గేల్‌ని ఒత్తిడిలోకి నెట్టారు.

మరో ఓపెనర్ ఎవిన్ లావిస్ (76: 100 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సు), రోవ్‌మాన్ పోవెల్ (59: 50 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ బౌలర్లలో డగ్ బ్రేస్‌వెల్ 4 వికెట్లు, టాడ్ ఆస్టల్ 3, లూకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు జార్జ్ వర్కర్ (57; 66 బంతుల్లో 8 ఫోర్లు), కొలిన్ మున్రో (49; 36 బంతుల్లో 8 ఫోర్లు) శుభారంభమిచ్చారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (38), రాస్ టేలర్ (49 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుని విజయపథంలో నడిపించారు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసి 55 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన
డగ్ బ్రాస్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం జరగనుంది.


తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 18:21 [IST]
Other articles published on Dec 20, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+