క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్: ఇంటర్నెట్‌లో వైరల్ (వీడియో)
హైదరాబాద్: క్రికెట్‌లో 'క‌్యాచెస్ విన్ మ్యాచెస్' అనే సామెత ఉంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్ టామ్ లాథమ్ అందుకున్న ఓ క్యాచ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు క్రికెట్‌లోనే ఆల్ టైమ్ బెస్ట్ క్యాచెస్‌లో ఒకటిగా దీనిని అభివర్ణిస్తున్నారు. హామిల్టన్ వేదికగా జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా కెప్టెన్ డుప్లెస్సీని ఓ అద్భుతమైన క్యాచ్ ద్వారా కివీస్ ఆటగాడు లాథమ్ పెవిలియన్‌కు పంపాడు.
హామిల్టన్ టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా షార్ట్‌లెగ్‌లో ఉన్న లాథమ్.. డుప్లెస్సీ స్వీప్ ఆడబోతున్నాడని ముందుగానే ఊహించి అందుకు తగినట్లు మెరుపు వేగంతో కుడివైపునకు కదిలి క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications