For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

New Zealand vs South Africa: చెల‌రేగిన స‌ఫారీలు.. కివీస్‌పై ఘ‌న‌విజ‌యం.. టెస్ట్ సిరీస్ స‌మం

New Zealand vs South Africa: South Africa Beat New Zealand by 198 runs agins 2nd test

న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో స‌ఫారీలు ఘ‌న విజ‌యం సాధించారు. అతిథ్య న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 198 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో స‌మం అయింది. కాగా మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌ఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 364 ప‌రుగుల‌కు ఆలౌటయ్యారు. ఓపెన‌ర్ సరేల్ ఎర్వీ (108) సెంచ‌రీతో చెల‌రేగాడు. మిగ‌తా వారిలో మాక్ర‌మ్ 42, ఎల్గ‌ర్ 41, మార్కో జెనీస‌న్ 37, మ‌హారాజ్ 36 ప‌రుగుల‌తో రాణించారు. కివీస్ బౌల‌ర్ల‌లో వాగ్న‌ర్ 4, మాట్ హెన్రీ 3, జేమీస‌న్ 2, సౌథీ ఒక వికెట్ తీశారు. అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 293 ప‌రుగుల‌కు ఆలౌటైంది. గ్రాండ్ హోం (120*) సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. మిచెల్ (60) హాఫ్ సెంచ‌రీతో రాణించారు. హెన్రీ నికోల‌స్ 39, వాగ్న‌ర్ 21 ప‌రుగులు చేశాడు. స‌ఫారీ బౌల‌ర్ల‌లో ర‌బాడ 5, మార్కో జేనీస‌న్ 4 వికెట్ల‌తో చెల‌రేగారు. మ‌హారాజ్ ఒక వికెట్ తీశాడు.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప‌ర్య‌ట‌క జ‌ట్టు సౌతాఫ్రికాకు 71 ప‌రుగుల అధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 354-9 వ‌ద్ద డిక్లేర్డ్ చేసింది. వెర్రెయిన్నే (136*) అజేయ సెంచ‌రీ చేశాడు. మార్కో జేనీష‌న్ 47, డ‌స్సెన్ 45, మ‌ల్డ‌ర్ 35 ప‌రుగులు చేశారు. కివీస్ బౌల‌ర్ల‌లో వాగ్న‌ర్, జేనీస‌న్, మాట్ హెన్రీ, సౌథీ త‌లో రెండు వికెట్లు తీశారు. గ్రాండ్‌హోం ఒక వికెట్ తీశాడు. అనంత‌రం 426 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌ ఏ ద‌శ‌లోనూ గెలిచేలా క‌నిపించ‌లేదు. 227 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌పై 198 ప‌రుగులు భారీ తేడాతో సౌతాఫ్రికా ఘ‌న‌విజ‌యం సాధించింది. డేవాన్ కాన్వే 92 ప‌రుగుల‌తో పోరాడిన‌ప్ప‌టికీ ఓట‌మి నుంచి త‌ప్పించ‌లేక‌పోయాడు. టామ్ బ్లండ‌ల్ 44 ప‌రుగులు చేశాడు.

మిగ‌తా వారిలో మిచెల్ 24, గ్రాండ్‌హోం 18, టీమ్ సౌథీ 17, జేమీష‌న్ 12, వాగ్న‌ర్ 10 ప‌రుగులు చేశారు. ఇక సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ర‌బాడ‌, జేన్స‌న్, మ‌హారాజ్ మూడేసి వికెట్లు తీశారు. లూథో సిపమ్లా ఒక వికెట్ తీశాడు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో స‌మం అయింది. కాగా తొలి టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. క‌గిసో ర‌బాడకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఇక మ్యాట్ హెన్రీ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపిక‌య్యాడు.

Story first published: Tuesday, March 1, 2022, 13:59 [IST]
Other articles published on Mar 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+