Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

New Zealand vs South Africa: మాట్ హెన్రీ విశ్వ‌రూపం.. 95కే కుప్పకూలిన స‌ఫారీలు.. తొలి రోజు కివీస్‌దే

New Zealand vs South Africa: Matt Henry took 7 wickets as South Africa were all out for 95 runs in the first innings.

న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌ను ప‌ర్యాట‌క జ‌ట్టు సౌతాఫ్రిగా ఫేల‌వంగా ఆరంభించింది. నేడు మొద‌లైన తొలి టెస్టులో స‌ఫారీలు మొద‌ట బ్యాటింగ్ చేశారు. అయితే కివీస్ పేస‌ర్ మాట్ హెన్రీ స‌ఫారీ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించాడు. త‌న కెరీర్ బెస్ట్ ఫ‌ర్‌ఫామెన్స్‌తో చెల‌రేడంతో సౌతాఫ్రికా ఏ ద‌శ‌లోనూ మంచి స్కోర్ సాధించేలా క‌నిపించ‌లేదు. హెన్రీ ఏకంగా 7 వికెట్ల‌తో విశ్వ‌రూపం చూపించాడు. దీంతో సౌతాఫ్రికా బ్యాట‌ర్లు ఒక‌రి వెంట మ‌రొక‌రు ఫెమిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. దీంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 49.2 ఓవ‌ర్ల‌లో 95 ప‌రుగుల‌కే కుప్పకూలింది. జ‌ట్టు మొత్తం క‌లిసి కూడా మూడు అంకెల మార్కు స్కోర్‌ను అందుకోలేక‌పోయింది

కివీస్ పేస‌ర్ మాట్ హెన్రీ 15 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 23 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 7 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. మిగ‌తా వారిలో సౌథీ, జేమ్స‌న్, వాగ్న‌ర్ త‌లో వికెట్ తీసి హెన్రీకి స‌హ‌క‌రించారు. ఇక సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో క‌నీసం ఒక్క‌రు కూడా 30 ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. ఆరుగురు బ్యాట‌ర్లు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితమ‌య్యారు. 25 ప‌రుగులు చేసిన జుబేర్ హంజా టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. వెర్రెయిన్నే 18, మాక్ర‌మ్ 15, సరేల్ ఎర్వీ 10 ప‌రుగులు చేశారు. ఆ జ‌ట్టు కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ ఒక్క ప‌రుగుకే ఔట‌య్యాడు. డ‌స్సెన్ 8, బ‌వుమా 7, ఒలివ‌ర్ ఒక్క ప‌రుగు చేశారు.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన అతిథ్య జ‌ట్టు న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల న‌ష్టానికి 116 ప‌రుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల‌స్ 37 ప‌రుగులు, నెయిల్ వాగ్న‌ర్ 2 ప‌రుగుల‌తో ఉన్నారు. డేవాన్ కాన్వే 36, కెప్టెన్ టామ్ లాథ‌మ్ 15, విల్ యంగ్ 8 ప‌రుగులు చేశారు. డువాన్ ఆలివర్ 2, మార్కో జేనీశ‌న్ ఒక వికెట్ తీశాడు. కాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్, ఆ జ‌ట్టు స్టార్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్‌లో ఆడ‌డం లేదు.

Story first published: Thursday, February 17, 2022, 13:16 [IST]
Other articles published on Feb 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+