For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్.. ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో టాస్‌ ఆలస్యం

New Zealand vs South Africa Match: Toss delayed due to wet outfield

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇప్పటికే న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ మొదలవ్వాలి. కానీ ఇప్పటి వరకు టాస్‌ కూడా పడలేదు. టాస్‌ వేసే సమయానికి ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటంతో.. టాస్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే మ్యాచ్ నిర్వ‌హించేందుకు పిచ్ అనుకూలంగానే ఉంది. ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండడంతో ఫీల్డు అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. అంపైర్లు మైదానాన్ని పరిశీలించి టాస్‌కు మరికొంత సమయం పడుతుందని తెలిపారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌ మరో విజయంపై కన్నేయగా.. మూడు ఓటముల తర్వాత ఆప్ఘనిస్థాన్‌పై గెలిచిన దక్షిణాఫ్రికా కూడా మరో విజయంను సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌ ఓడితే దక్షిణాఫ్రికా సెమీస్‌ ఆశలు పూర్తిగా గల్లంతవడం ఖాయం. సెమీస్ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సఫారీ ఆట‌గాళ్లు ఎలా ఆడుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లు ఇప్పటివరకు 70 వన్డేలు ఆడాయి. 41 మ్యాచ్‌ల్లో సఫారీలు గెలిస్తే.. 24 మ్యాచ్‌ల్లో కివీస్‌ నెగ్గింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. ఇక ప్రపంచకప్‌లో కివీస్‌, దక్షిణాఫ్రికాలు 7 సార్లు తలపడ్డాయి. కివీస్‌ ఐదు మ్యాచ్‌ల్లో గెలవగా.. సఫారీలు రెండింట్లో విజయం సాధించారు.

Teams (Probably XI):
New Zealand: Kane Williamson (capt), Trent Boult, Colin de Grandhomme, Lockie Ferguson, Martin Guptill, Tom Latham (wk), Jimmy Neesham, Henry Nicholls, Mitchell Santner, Tim Southee and Ross Taylor

South Africa: Faf du Plessis (c), Quinton de Kock (wk), Aiden Markram, Hashim Amla, Rassie van der Dussen, David Miller, Chris Morris, Andile Phehlukwayo, Kagiso Rabada, Lungi Ngidi and Imran Tahir

Story first published: Wednesday, June 19, 2019, 15:21 [IST]
Other articles published on Jun 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+