
హైదరాబాద్: ఎడ్జిబాస్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 145 పరుగుల వద్ద గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో మున్రోకు క్యాచ్ ఇచ్చి మారక్రమ్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మారక్రమ్ 55 బంతుల్లో 4 పోర్ల సాయంతో 38 పరుగులు చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అంతకముందు ఓపెనర్ హషీమ్ ఆమ్లా హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో సాట్నర్ బౌలింగ్‌లో ఆమ్లా(55) ఔటయ్యాడు. 59 పరుగులకే రెండు కీలక వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిర్మించి 75 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
ఈ క్రమంలో ఆమ్లా వన్డేల్లో అత్యంత అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. కోహ్లీ వన్డేల్లో 8వేల పరుగుల మైలరాయిని 175 ఇన్నింగ్స్‌లో అందుకోగా ఆమ్లా 176 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో పాటు దక్షిణాఫ్రికా తరఫున 8000 పరుగులు అందుకున్న నాలుగో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
అంతకముందు ఫెర్గూసన్ వేసిన ఓ అద్భుతమైన యార్కర్‌కి డుప్లెసిస్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 35 బంతుల్లో బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్(23) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా, మ్యాచ్ ఆరంభంలోనే బోల్ట్ బౌలింగ్‌లో రెండో ఓవర్ ఐదో బంతికి 9 పరుగుల వద్ద ఓపెనర్ డికాక్(5) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.