For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర‌ సృష్టించిన విలియమ్సన్.. సచిన్‌కూ సాధ్యం కానీ ఘనత!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 172 ఇన్నింగ్స్‌ల్లోనే విలియమ్సన్ ఈ ఘనత అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 174 ఇన్నింగ్స్‌‌ల్లో 32 సెంచరీలు సాధించాడు.

టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలు సాధించిన జాబితాలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్ (176 ఇన్నింగ్స్), సచిన్ టెండూల్కర్ (179 ఇన్నింగ్స్), యునిస్ ఖాన్ (183 ఇన్నింగ్స్) ఉన్నారు. ఈ క్రమంలో విలియమ్సన్ మరిన్ని రికార్డులు బద్దలుకొట్టాడు. టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు.

New Zealand vs South Africa: Kane Williamson made history in Test Cricketer

ప్రస్తుత యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన అయిదో ఆటగాడిగా కేన్ మామ రికార్డు నెలకొల్పాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి విలియమ్సన్ 45 సెంచరీలు బాదాడు. కేన్ విలియమ్సన్ కంటే ముందు విరాట్ కోహ్లి (80), డేవిడ్ వార్నర్ (49), రోహిత్ శర్మ (47), జో రూట్ (46) మాత్రమే ఉన్నారు. కాగా,గత 12 ఇన్నింగ్స్‌ల్లో విలియమ్సన్ ఏడు సెంచరీలు సాధించడం విశేషం.

టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. విలియమ్సన్ తర్వాత రెండో స్థానంలో రాస్ టేలర్ (19 సెంచరీలు) ఉన్నాడు. కాగా, రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకెళ్తోంది. విజయానికి మరో 38 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో విలియమ్సన్ (109*; 221 బంతుల్లో)తో పాటు విల్ యంగ్ (45*; 110 బంతుల్లో) ఉన్నారు.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 242 పరుగులు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 211 పరుగులు
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 235 పరుగులు
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 229/3 (విజయానికి 38 పరుగులు అవసరం)

Story first published: Friday, February 16, 2024, 10:03 [IST]
Other articles published on Feb 16, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+